పరిశ్రమలో మద్యం విక్రయంపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2020-06-22T10:27:58+05:30 IST

హిందూపురం మండలంలోని పారిశ్రామికవాడలో వారం రోజుల క్రితం వేరే రాష్ట్రానికి చెందిన కార్మికుడు కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి ఓ

పరిశ్రమలో మద్యం విక్రయంపై పోలీసుల దాడి

తిరగబడ్డ కార్మికులు.. ఆలస్యంగా వెలుగుచూసిన వైనం... గుట్టుచప్పుడు కాకుండా విచారణ హిందూపురం టౌన్‌, జూన్‌ 21: హిందూపురం మండలంలోని పారిశ్రామికవాడలో వారం రోజుల క్రితం వేరే రాష్ట్రానికి చెందిన కార్మికుడు కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి ఓ పరిశ్రమ వద్ద విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం తూముకుంట చెక్‌పోస్టు వద్ద ఉన్న ఎస్‌పీఓకు సమాచారం అందింది. దీంతో సదరు ఎస్‌పీఓ, తూముకుంటకు చెందిన ఓ యువకుడు మద్యం విక్రయిస్తున్న చోటికి వెళ్ళి వారిని ప్రశ్నించారు. దీంతో కార్మికులు ఒక్కసారిగా ఎస్‌పీఓ, యువకుడిపై దాడిచేశారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. వెంటనే ముగ్గురు కానిస్టేబుల్‌లు అక్కడికి వెళ్లారు. అ క్కడ కార్మికులను ప్రశ్నించగా పోలీసులపైనే తిరగబడ్డారు. ఒకానొకదశలో పోలీసులపై దాడిచేసేందుకు యత్నించగా అక్కడి నుంచి పోలీసులు జారుకున్నారు. అయితే దీనిపై పోలీస్‌ అధికారి సీరియ్‌సగా పరిగణించి ఇద్దరిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కేసు నమోదుచేసినట్లు స మాచారం.


అయితే దీనిపై గుట్టు చప్పుడు కాకుండా విచార ణ చేస్తున్నట్లు సమాచారం. కార్మికులకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఒత్తాసు పలుకుతున్నట్లు స మాచారం. అంతేకాకుండా వారం క్రితం జరిగిన ఘటన తూముకుంట, గోళ్ళాపురం పారిశ్రామికవాడలో చర్చ జరుగుతోంది. దీనిపై హిందూపురం మండల సీఐ శ్రీనివాసులును వివరణ కోరగా లాంటి సంఘటనేది జరగలేదని పో లీసులపై ఎవరూ తిరగబడలేదని పేర్కొనడం విశేషం. 


అ యితే ఆరోజు కార్మికులను పోలీసులు విచారిస్తున్న ఫోటోలతోపాటు పోలీసులపై దాడిచేసిన కార్మికులను ఫోన్‌లో మాట్లాడినా అధికార పార్టీకి చెందిన కార్యకర్త ఆడియో రికార్డులు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Updated Date - 2020-06-22T10:27:58+05:30 IST