-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Poisonous to sisteres
-
అక్కాచెల్లెలికి విషజ్వరాలు
ABN , First Publish Date - 2020-03-13T11:08:14+05:30 IST
మండలంలోని చంద్రగిరి గ్రామానికి చెందిన సుంకన్న, కుళ్లాయమ్మ దంపతుల కుమార్తె వనిత (13) గురువారం విషజ్వరంతో మృతి చెందింది.

అక్క మృతి... చికిత్స పొందుతున్న చెల్లి
బొమ్మనహాళ్, మార్చి 12 : మండలంలోని చంద్రగిరి గ్రామానికి చెందిన సుంకన్న, కుళ్లాయమ్మ దంపతుల కుమార్తె వనిత (13) గురువారం విషజ్వరంతో మృతి చెందింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలివి. వీరికి ఇద్దరు కుమార్తెలు వనిత, చైత్రతో పాటు మరో కుమారుడు ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం ఎనిమిదేళ్ల చైత్రకు జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంతలోనే పెద్ద కుమార్తె వనితకు కూడా జ్వరం రావడంతో బుధవారం పరీక్షల కోసం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున వనిత మృతి చెందింది. చైత్ర అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.