-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Person killed in road accident
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-03-23T10:06:15+05:30 IST
మండల పరిధిలోని వెంకటరెడ్డిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లోకేష్(30) మృతి చెందాడు.

పెనుకొండ, రూరల్ మార్చి22: మండల పరిధిలోని వెంకటరెడ్డిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లోకేష్(30) మృతి చెందాడు. ఏఎ్‌సఐ అక్బర్ తెలిపిన వివరాల మేరకు.. సోమందేపల్లి మండలం బ్రహ్మణపల్లికి చెందిన లోకేష్, కలకండప్ప, మలయ్య, ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంలో పని నిమిత్తం కియ పరిశ్రమకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి బయల్దేరారు.
ఈ క్రమంలో వెంకటరెడ్డిపల్లి సమీపంలోకి రాగానే కుక్క అడ్డురావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకేష్ అక్కడిక్కడే మృతి చెందగా కలకండప్ప, మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. మృతుడు లోకేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. ఘటనపై పెనుకొండ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.