-
-
Home » Andhra Pradesh » Ananthapuram » People on the roads no matter the lockdown
-
లాక్‌డౌన్ ఉన్నా రోడ్లపైకి జనం
ABN , First Publish Date - 2020-03-24T10:37:39+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభు త్వం ప్రకటించిన లాక్‌డౌన్ తొలిరోజు సోమవారం అనంత నగరంలో సంపూర్ణంగా అమ లు కాలేదనే చెప్పాలి.

అనంతలో నిర్బంధ చర్యలు చేపట్టిన
పోలీసులు, అధికారులు..
రహదారులకు అడ్డంగా
బారికేడ్ల ఏర్పాటు..
అనంతపురంక్రైం/కార్పొరేషన్/క్లాక్‌టవర్/అర్బన్/సెంట్రల్/రూరల్, మార్చి 23: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభు త్వం ప్రకటించిన లాక్‌డౌన్ తొలిరోజు సోమవారం అనంత నగరంలో సంపూర్ణంగా అమ లు కాలేదనే చెప్పాలి. ఉదయాన్నే పెద్దఎత్తు న జనం రోడ్లపైకి వచ్చారు. పాతూరులోని మార్కెట్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడా యి. మార్కెట్ కిక్కిరిసిపోయింది. అక్కడక్క డా దుకాణాలు కూడా తెరుచుకున్నాయి. దీం తో పోలీసులు, అఽధికారులు నిర్బంధ చర్యల కు ఉపక్రమించారు. ఎక్కడికక్కడ బంద్ చే యించారు. వాహనదారులను అడ్డుకుని, వె నక్కి పంపించారు. దీంతో మధ్యాహ్నానికి లాక్‌డౌన్ వాతావరణం కనిపించింది. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, తదితర వాహనాలు నిలిచిపోయా యి. పోలీసులు, ప్రత్యేక బృందాలు నగర వీధుల్లో కలియతిరిగారు. ఎక్కడిక్కడ వాహనాలను ఆపి, సహకరించాలని కోరారు. కొన్ని ప్రధాన రహదారుల్లో అడ్డగా డివైడర్లు ఉం చి, వాహనదారులను మందలించారు. గుం పులుగ్రూపులుగా లేకుండా ఉండాలని హె చ్చరించారు. చిన్నపాటి దుకాణాలు తెరిచిఉండటంతో వెంటనే మూయించేశారు. ప్ర ధాన కూడళ్లలో జనాలు ఎక్కువగా ఉండటం తో వెంటనే వారందరినీ తరిమేశారు.
ఆటోలకు అత్యవసరమైతేనే అనుమతి
ఆటోలను అత్యవసర సమయాల్లో మాత్ర మే అనుమతిస్తామని ట్రాఫిక్ సీఐ రాజశేఖర్, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు వరప్రసాద్, నరసింహులు పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసుస్టేషన్, శ్రీకంఠం సర్కిల్, సప్తగిరి సర్కిల్ తదితర ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లు, య జమానులతో వారు మాట్లాడారు. ఆటోలను ఈనెల 31వ తేదీ వరకు నగరంలో న డపరాదని హెచ్చరించారు. ప్రయాణికులకు అత్యవసరమైతేనే తీసుకెళ్లాలన్నారు. అనవసరంగా నడిపితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూరగాయాలు, పాలు, ఆరోగ్య సమస్యలతో కూడిన వారిని మా త్రమే తీసుకెళ్లటానికి ఆటోలకు అనుమతిస్తామన్నారు. ఈనెల 22వ తేదీన నిర్వహించాల్సిన చెస్ సెలెక్షన్స్ వాయిదా వేసినట్లు జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రవిరాజు తెలిపారు. తదుపరి నిర్వహణ తేదీలు, వేదికను ప్రకటిస్తామన్నారు. వివరాలకు 9848360598 నెం బరులో సంప్రదించాలని కోరారు.
చేతులు శుభ్రం చేసుకు రండి..
చేతులు శుభ్రం చేసుకుని, కార్యాలయంలో కి రావాలంటూ విద్యుత్ శాఖాధికారులు సూ చిస్తున్నారు. ఆ మేరకు కార్యాలయం ఎ దు ట లిక్విడ్, నీటిని అందుబాటులో ఉంచా రు. కార్యాలయంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ చేతు లు లిక్విడ్‌తో శుభ్రం చేసుకుని, రావాలని చెబుతుండటం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన తపాలా, బీఎ్‌సఎన్‌ఎల్ కార్యాలయాలు తెరుచుకున్నా యి. కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవటం శోచనీయం.
కరోనా వైరస్ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నగరంలో నడిచిన 12 ఆటోలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ట్రాఫిక్ డీ ఎస్పీ మున్వర్‌హుస్సేన్ నేతృత్వంలో సీఐ రాజశేఖర్, సిబ్బంది నగరంలో కలియతిరిగారు. నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న 12 ఆటోలపై కేసులు నమోదు చేసి, సీజ్ చేసినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. త్రీటౌన్ సీఐ రెడ్డెప్ప, ఎస్‌ఐ జైపాల్‌రెడ్డితో కలిసి తమ స్టేషన్ పరిధిలోని పలు దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. దుకాణాలు తె రిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక దుకాణంపై కేసు నమో దు చేశారు. గుత్తిలో లాక్ డౌన్‌కు వి రుద్ధంగా నడుపుతున్న 18 ఆటోలను ఎంవీఐ, పోలీసులు సీజ్ చేశారు.
ధర్మవరంలో..
ధర్మవరంఅర్బన్: పట్టణ ప్రజలు లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చారు. సీఐ కరుణాకర్ కరోనా వైర్‌సపై అవగాహన కల్పిస్తూ ప్రజలను ఇళ్లకు పంపించారు. అత్యవసర సేవలకు తప్పా వేరే వాహనాలను అనుమతించట్లేదు. వివిధ గ్రామాల నుంచి వైద్య చికిత్సలు చేయించుకోవడానికి రోగులు ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలివచ్చారు. ఎన్టీఆర్, ఆంజుమన్ సర్కిల్‌లో కిరా ణా, వస్త్ర దుకాణాలు తెరవటంతో ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడారు. ఆర్డీఓ మధుసూదన్ అక్కడికి వెళ్లి షాపులను మూసివేయించారు. మండలంలోని పోతుకుంట, గొ ట్లూరు గ్రామాలలో రూరల్ ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు కరోనా నివారణకు మైక్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లో లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ప్రజల భాగస్వామ్యంతోనే కరోనాను అ రికట్టవచ్చని ఆర్డీఓ మధుసూదన్ పిలుపు ని చ్చారు. ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మల్లికార్జున, డీఎస్పీ రమాకాంత్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో స మావేశం నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడు తూ ప్రభుత్వాస్పత్రిలో ఇప్పటికే 10 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు.
ఉరవకొండలో..
లాక్‌డౌన్ ఆదేశాలను ఉరవకొండలో జ నర బేఖాతరు చేశారు. ఎక్కడ చూసినా జ నం గుంపులు గుంపులుగా కనిపించారు. ఉ రవకొండ క్లాక్ టవర్, చర్చి కూడలిలో రద్దీ ఎక్కువగా కనిపించింది. వారిని కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పొచ్చు. విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, కూడేరు మండలాల్లో లాక్‌డౌన్ ఆదేశాలు అమలయ్యాయి.
గుంతకల్లులో..
గుంతకల్లు నియోజకవర్గవ్యాప్తంగా దుకాణాలు మూతపడ్డాయి. హోటళ్లు, చికెన్ దుకాణాలను పోలీసులు బంద్ చేయించారు. గుం తకల్లు, గుత్తి, పామిడి మండలాల్లోనూ దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. గుత్తి పట్టణంలో మాత్రం ప్రభుత్వ ఆదేశాలను జనం బేఖాతరు చేశారు. ఎక్కడ చూసినా గుంపులుగుంపులుగా కనిపించారు. జనరద్దీని నియంత్రించడంలో అధికార యంత్రాం గం విఫలమైంది.
తాడిపత్రిలో..
డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు పట్టణాన్ని అధీనంలోకి తీసుకుని, ప్రధాన రహదారులను మూసివేశారు. వా హనాలు తిరగకుండా బారికేడ్లను పెట్టి, బం ద్ చేయించారు. వాహనాల్లో తిరిగే వారి తోపాటు గుంపులుగుంపులుగా ఉంటున్న వా రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.