-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Paternity inquiry at Onetown station
-
వన్‌టౌన్ స్టేషన్‌లో తండ్రీకొడుకుల విచారణ
ABN , First Publish Date - 2020-06-22T10:27:03+05:30 IST
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసుల్లో భాగంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలను

ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్టేషన్‌లోనే
జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి.. నేడు కడపకు తరలింపు
అనంతపురం క్రైం, జూన్ 21 : వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసుల్లో భాగంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలను నగరంలోని వన్‌టౌన్ పోలీ్‌సస్టేషన్‌లో ఆదివారం విచారించారు. డీఎస్సీ వీరరాఘవరెడ్డి, సీఐ ప్రతా్‌పరెడ్డి, న్యాయవాది రవికుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ 7 కేసులకు సంబంధించి విచారణ సాగింది. నిందితులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించారు.
కోర్టు ఆదేశాల మేరకు కడప సెంట్రల్ జైలు నుంచి నగరంలోని వన్‌టౌన్ పోలీ్‌సస్టేషన్‌కు విచారణ నిమిత్తం వారిని తీసుకువచ్చారు. దీంతో వారి అనుచరులు, టీడీపీ శ్రేణులు అక్కడికి రావడంతో ప్రత్యేక బలగాలు, సివిల్ పోలీసులతో భ ద్రత కట్టుదిట్టం చేశారు. మొదట జేసీ ప్రభాకర్‌రెడ్డి, తర్వాత ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని వేర్వేరుగా విచారణ చేసినట్లు సమాచా రం. సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకూ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు ప్ర త్యేక వాహనాల్లో భద్రత నడుమ తరలించనున్నారు.