పరిటాల రవి గురించి నీకేమి తెలుసు?

ABN , First Publish Date - 2020-12-11T05:55:37+05:30 IST

‘పరిటాల రవీంద్ర గురించి నీకేమి తెలుసని మాట్లాడుతున్నావ్‌’ అంటూ హిందూపు రం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు.

పరిటాల రవి గురించి నీకేమి తెలుసు?

ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యాఖ్యలపై పరిటాల సునీత ఆగ్రహం

అనంతపురం వైద్యం, డిసెంబరు10: ‘పరిటాల రవీంద్ర గురించి నీకేమి తెలుసని మాట్లాడుతున్నావ్‌’ అంటూ హిందూపు రం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. ఎంపీ వ్యాఖ్యలపై గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పరిటాల రవీంద్ర గురించి గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. పరిటాల రవి గురించి మాధవ్‌కు ఏమి తెలుసని ప్రశ్నించారు. ఆయన ఏమైనా చూశాడా అని నిలదీశారు. రవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతోపాటు అనేక వర్గాలు ప్రశాంతంగా ఈ ప్రాంతంలో ఉన్నాయని తెలుసా అంటూ మాధవ్‌పై ధ్వజమెత్తారు. పేద ప్రజలకు అం డగా నిలిచిన వ్యక్తి పరిటాల రవి అన్నారు. ‘మాధవ్‌ నీ చరిత్ర కూడా మాకు తెలుసు. నీలాగా రోడ్డెక్కి మాటా ్లడి.. మా విలువ తగ్గించుకోమన్నా’రు. మరోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని సునీత హెచ్చరించారు.రక్తపుటేరులు పారిస్తే పోలీసులు ఊరుకుంటారా..?

ఆ వృత్తి నుంచే వచ్చావ్‌.. ఆ మాత్రం తెలీదా?

నీలా రేపిస్టు చరిత్ర మాకు లేదు

పరిటాల రవీంద్రపై పదేపదే మాట్లాడటం మానుకో..

ఎంపీ మాధవ్‌పై పరిటాల శ్రీరామ్‌ ఫైర్‌

అనంతపురం వైద్యం, డిసెంబరు10: ‘నీవు పోలీసు వృత్తి నుంచి వచ్చావ్‌. రక్తపుటేరులు పారిస్తే పోలీసులు ఊరుకుంటారా? ఆ మాత్రం తెలీదా?’ అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై టీడీపీ యువనేత, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఫైర్‌ అయ్యారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్రపై ఎంపీ చేసిన వ్యాఖ్యలపై గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శ్రీరామ్‌ విలేకరులతో మాట్లాడారు. పదేపదే మాట్లాడితే అబద్దం నిజం కాదన్న విషయాన్ని మాధవ్‌ తెలుసుకోవాలన్నారు. నిజాయతీగా వ్యవహరించే పోలీసు అధికారులున్నారన్నారు. రక్తపుటేరులు పారిస్తే.. వారంతా చూస్తూ ఊరుకుంటారా అని శ్రీరామ్‌ ప్రశ్నించారు. బడుగుల కోసం పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్‌ ముద్ర వేయించుకున్నారన్న విషయం ఎంపీకి కూడా తెలుసన్నారు. పోలీసు వృత్తిలో ఉన్నపుడు అనేకసార్లు దీనిని ప్రస్తావించారన్నారు. ఖాకీ వదిలి.. ఖద్దరు వేయగానే రవీంద్ర ఫ్యాక్షనిస్టు అయ్యాడా అంటూ శ్రీరామ్‌ ప్రశ్నించారు. ప్రజాపోరాటంలోనే తమ కుటుంబంపై ఫ్యాక్షన్‌ ముద్ర పడిందన్నారు. ఎంపీలాగా ఢిల్లీ స్థాయిలో సంచలనం రేపిన రేపిస్ట్‌ చరిత్ర తమకు లేదన్నారు. పరిటాల రవీంద్రపై పదేపదే వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని మాధవ్‌కు హితవు పలికారు. పుట్టకనుమ రిజర్వాయర్‌ను రద్దు చేసి, మూడు రిజర్వాయర్లు నిర్మిస్తామని వైసీపీ ప్రకటించటం సరికాదన్నారు. రైతులపై ప్రేమ ఉంటే పుట్టకనుమతోపాటు మరో మూడు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ అధికారంలో ఉంది కావున, పేరూరు ఎత్తిపోతల పథకానికి పెట్టిన పరిటాల రవీంద్ర పేరును మార్చారనీ, టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పేరును పునరుద్ధరిస్తామన్నారు. పేరు తొలిగించినంత మాత్రాన అక్కడ అభివృద్ధి చేసింది పరిటాల సునీతమ్మ అన్న విషయాన్ని దాచలేరని శ్రీరామ్‌ పేర్కొన్నారు.
    చరిత్ర తెలుసుకుని మాట్లాడటం నేర్చుకో..

    ఎంపీ మాధవ్‌కు బీకే చురకలు

    పెనుకొండ, డిసెంబరు 10: చరిత్ర తెలుసుకుని మాట్లాడటం నేర్చుకోవాలంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారధి చురకలంటించారు. గురువారం స్థానిక తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిటాల రవీంద్ర హయాంలో ఈ ప్రాంతంలో రక్తం ఏరులై పారిందని ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యాఖ్యానించటం సరికాదన్నారు. ‘కర్నూలు జిల్లావాడివి అనంత చరిత్ర నీకేం తెలుసు, పరిటాల రాజకీయంలోకి రాకముందు ఈ ప్రాంతం ఎలా ఉండేదో నీకు తెలుసా? అసలు జిల్లాలో మహిళల మానప్రాణాలకు రక్షణ ఉండేదా?’ అని ప్రశ్నించారు. పరిటాల రాకతో జిల్లాలో అరాచక శక్తులను అణచి, ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు. వైసీపీలోనే సముచిత స్థానం లేని మాధవ్‌.. పరిటాలను విమర్శించటమేంటని మండిపడ్డారు. నిజానిజాలు తెలుసుకుని, మాట్లాడటం నేర్చుకోవాలని మాధవ్‌కు హితవు పలికారు. పేరూరు ఎత్తిపోతల పథకం పేరును పరిటాల రవీంద్ర నుంచి వైఎ్‌సఆర్‌గా మార్చటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వాలు మారినపుడలా పేర్లు మార్చటం మంచి పద్ధతి కాదన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు శ్రీరామిరెడ్డి, అనంత వెంకటరెడ్డి, జేసీ నాగిరెడ్డి లాంటి నేతల పేర్లు పెట్టాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినా వాటి పేర్లు మార్చలేదన్నారు. అధికారం శాశ్వతం కాదనీ, రేపు తాము అఽధికారంలోకి రాగానే ఇదే పద్ధతి అవలంబిస్తే ఎలా ఉంటుందో చెప్పండని బీకే ప్రశ్నించారు.

Updated Date - 2020-12-11T05:55:37+05:30 IST