వైసీపీ పాలనలో అభివృద్ధి కన్నా.. విధ్వంసాలే ఎక్కువ

ABN , First Publish Date - 2020-12-17T06:33:15+05:30 IST

వైసీపీ 18 నెలల పాలనలో అభివృద్ధి కన్నా.. ఆ పార్టీ నేతలు చేసిన విధ్వంసాలే ఎక్కువని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనంతగా టీడీపీ హయాంలోనే అభివృద్ధి చేసిన విషయాన్ని ఎమ్మెల్యే తో పుదుర్తి ప్రకా్‌షరెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

వైసీపీ పాలనలో అభివృద్ధి కన్నా.. విధ్వంసాలే ఎక్కువ

మాజీ మంత్రి పరిటాల సునీత

అనంతపురం, డిసెంబరు16(ఆంధ్రజ్యోతి): వైసీపీ 18 నెలల పాలనలో అభివృద్ధి కన్నా.. ఆ పార్టీ నేతలు చేసిన విధ్వంసాలే ఎక్కువని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనంతగా టీడీపీ హయాంలోనే అభివృద్ధి చేసిన విషయాన్ని ఎమ్మెల్యే తో పుదుర్తి ప్రకా్‌షరెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాప్తాడు నియోజకవర్గాన్ని తాము అభివృద్ధి పనులతో ప్రగతిపథంలో నడిపిస్తే.. పగలు, కక్ష సాధింపు చర్యలతో వైసీపీ నేతలు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమ్యూనిటీ భవనాలను తాము నిర్మిస్తే.. వైసీపీ నేతలు ప్రతి ఊరిలోనూ విధ్వంసాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తాము ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.21 కోట్లు నియోజకవర్గంలో అందించామన్నారు. వైసీపీ పాలనలో ఎంత మందికి సాయమందించారని ప్రశ్నించారు. 3,257 ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రూ.217 కోట్లు వెచ్చించి, సిమెంటు రోడ్లు వేశామన్నారు. ఇప్పటి వరకూ ఒక కాలనీలోనైనా రోడ్డు వేశారా అని వైసీపీ నేతలను నిలదీశారు. హంద్రీనీవా నీటితో నియోజకవర్గంలోని చెరువులను నింపుతూ అభివృద్ధికి బాటలు వేస్తే.. అబద్ధాలతో వైసీపీ నేతలు గాలిమేడలు కడుతున్నారని విమర్శించారు.


Updated Date - 2020-12-17T06:33:15+05:30 IST