వడ్లు కొనుగోలు చేస్తాం.. ఆందోళన వద్దు : డీఎం

ABN , First Publish Date - 2020-12-19T06:49:21+05:30 IST

రైతుల నుంచి త్వరలోనే వడ్లు కొనుగోలు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సివిల్‌ సప్లై డీఎం హరిప్రసాద్‌ పేర్కొన్నారు.

వడ్లు కొనుగోలు చేస్తాం.. ఆందోళన వద్దు : డీఎంకణేకల్లు, డిసెంబరు 18: రైతుల నుంచి త్వరలోనే వడ్లు కొనుగోలు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సివిల్‌ సప్లై డీఎం హరిప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయన మి ల్లర్లు, రైతులతో సమావేశమయ్యారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధా న్యాన్ని మిల్లర్ల ద్వారా బియ్యంగా మార్చే విషయంతో పాటు ప్రస్తుతం వ రి ధరలు ఏరకంగా వున్నాయనేదానిపై ఆయన చర్చించారు. అలాగే ప్ర భుత్వం ఆధ్వర్యంలో నడిచే వరి కొనుగోలు కేంద్రంలో మొదటి రకం రూ. 1880, సాధారణ రకం రూ.1860కి కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఉషారాణి, మిల్లర్లు హాజరయ్యారు. 


Read more