పీఏబీఆర్‌లో భారీగా చేరిన నీరు

ABN , First Publish Date - 2020-11-26T06:40:15+05:30 IST

మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు 5 టీఎంసీల నీరు చేరింది. తుంగభద్ర డ్యాం నుంచి పీఏబీఆర్‌లోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది

పీఏబీఆర్‌లో భారీగా చేరిన నీరు


పీఏబీఆర్‌లో ఐదు టీఎంసీల నీరు


కూడేరు, నవంబరు 25 : మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు 5 టీఎంసీల నీరు చేరింది. తుంగభద్ర డ్యాం నుంచి పీఏబీఆర్‌లోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బుధవారం నాటికి డ్యాం దాదాపు 5 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్ల నుంచి నీరు బయటకు వస్తోంది. నాలుగైదేళ్ల క్రితం డ్యాంలో ఈస్థాయిలో నీటిని నిల్వ చేశారు. ప్రస్తుతం పీఏబీఆర్‌ డ్యాం నిండుకుండలా తొణికిసలాడుతోం ది. బుధవారం డ్యాంలోకి తుంగభద్ర నుంచి 808 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. త్వరలో పీఏబీఆర్‌ డ్యాం నుంచి కుడి కాలువకు నీరు వదిలే అవకాశం ఉందని తెలుస్తోంది.


Updated Date - 2020-11-26T06:40:15+05:30 IST