ప్రజలు తల్లడిల్లిపోతుంటే..

ABN , First Publish Date - 2020-05-08T07:57:55+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు, రైతులు తల్లడిల్లిపోతున్న తరుణంలో ప్రభుత్వం మద్యం షాపులు తెరవటం

ప్రజలు తల్లడిల్లిపోతుంటే..

మద్యం షాపులు తెరవటం సిగ్గుచేటు

మాజీ మంత్రి పల్లె ధ్వజం


కొత్తచెరువు, మే 7: కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు, రైతులు తల్లడిల్లిపోతున్న తరుణంలో ప్రభుత్వం మద్యం షాపులు తెరవటం సిగ్గుచేటని మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పుట్టపర్తికి వెళ్తూ కొత్తచెరువులో పల్లె విలేకరులతో మాట్లాడారు.రైతులు ప్రస్తుతం బోరుబావుల కింద వేరుశనగ, వరి పంటలు సాగు చేయటానికి సిద్ధమవుతుంటే అందుకనుగుణంగా ఎరువుల దుకాణాలు తెరవకపోవటం దారుణమన్నారు. మద్యం ధరలు అత్యధికంగా పెంచిన ఘనత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో మద్యం దుకాణాలు తెరిచి, ప్రజలను వైర్‌సకు మరింత దగ్గర చేసేలా ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. ఇప్పటికైనా ప్రజలు, రైతులకు అవసరమయ్యే వాటిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు బోయరాజు, గాజుల చంద్రమోహన్‌, ఒలిపి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-08T07:57:55+05:30 IST