రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-03-13T11:10:02+05:30 IST

మండలంలోని సింగనేకుంట సమీప మలుపులో ద్విచక్ర వాహనం అడవి పందిని ఢీకొన్న ప్రమాదంలో గంగాధర్‌ (32) బుధవారం రాత్రి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నల్లమాడ, మార్చి 12 : మండలంలోని సింగనేకుంట సమీప మలుపులో ద్విచక్ర వాహనం అడవి పందిని ఢీకొన్న ప్రమాదంలో గంగాధర్‌ (32) బుధవారం రాత్రి మృతి చెందాడు. హెడ్‌కానిస్టేబుల్‌ జగదీ్‌షబాబు తెలిపిన వివరాలివి. బుక్కరాయసముద్రం మండలం రామిరెడ్డికాలనీకి చెందిన గంగాధర్‌ భార్య శ్రీమతి ఓబుళదేవరచెరువు మండలం దిగువపల్లికి పురుడు నిమిత్తం వెళ్లింది. రాత్రి 11 గంటల సమయంలో అనంతపురం నుంచి గంగాధర్‌ ద్విచక్ర వాహనంలో భార్యను చూడటానికి వచ్చాడు.


మార్గమధ్యంలో నల్లమాడ మండలం నల్లశింగయ్యగారిపల్లి సింగనేకుంట వద్ద మలుపులో ద్విచక్ర వాహనం అడవి పందిని ఢీకొంది. ప్రమాదంలో గంగాధర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఆ దారిలో వెళ్లే వారు ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి ట్రైనీ డీఎస్పీ క్రిష్ణచైతన్య పోలీసు సిబ్బందితో వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య శ్రీమతి, ఇద్దరు కు మార్తెలు,  కుమారుడు ఉన్నారు.  మృతుడి తండ్రి వెంకటేష్‌ ఫి ర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Updated Date - 2020-03-13T11:10:02+05:30 IST