ఎద్దులబండిని ఢీకొని ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-08-16T11:39:25+05:30 IST
మండలంలోని శ్రీనివాస క్యాంపు గ్రామ సమీపంలో ఎద్దులబండిని ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుం

బొమ్మనహాళ్, ఆగస్టు 15 : మండలంలోని శ్రీనివాస క్యాంపు గ్రామ సమీపంలో ఎద్దులబండిని ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల మేరకు మండలంలోని దేవగిరి గ్రామానికి చెందిన మంజు (28) అనే వ్యక్తితో పాటు చిరంజీవి ఇద్దరు కలసి ఉద్దేహాళ్ గ్రామం నుంచి ద్విచక్రవాహనంలో వారి స్వగ్రామమైన దేవగిరి వైపు వెళుతుండగా బళ్లారి - కళ్యాణదుర్గం రహదారిలో ఉన్న శ్రీనివాస క్యాంపు గ్రామ సమీపంలో దేవగిరి క్రాస్ వైపు వెళుతున్న ఎద్దుల బండిని శుక్రవారం రాత్రి ఢీకొన్నారు.
దీంతో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికులు 108 వాహనంలో బళ్లారి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సలు పొందుతూ మంజుకు తీవ్ర గాయాలు కావడంతో అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.