-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Old train collides with train
-
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2020-03-13T11:09:29+05:30 IST
పుట్టపర్తి ప్రశాంతి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం రైలు ఢీకొని బుక్కపట్నం మండలం క్రిష్ణాపురం గ్రామానికి చెందిన దేవరకొండ నాగన్న (70) మృతి చెందాడు.

కొత్తచెరువు, మార్చి 12 : పుట్టపర్తి ప్రశాంతి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం రైలు ఢీకొని బుక్కపట్నం మండలం క్రిష్ణాపురం గ్రామానికి చెందిన దేవరకొండ నాగన్న (70) మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి. రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరాతీశారు. మృతుడు నాగన్నగా గుర్తించారు. రైలు నుంచి జారి పడ్డాడా లేదా పట్టాలు దాటుతుండగా మృతి చెందాడా అన్న కోణంలో రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.