మిత్రుడి కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయూత

ABN , First Publish Date - 2020-12-13T06:40:00+05:30 IST

స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 1997-98 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు తమ మిత్రుడు గాలిమిషన్‌ రవి మృతి చెందడంతో ఆకుటుంబానికి శనివారం ఆర్థికసాయం అందజేశారు. స్థానిక జడ్పీఉన్నత పాఠశాలలో పూర్వ వి ద్యార్థులు సమావేశం ఏర్పాటు చేశారు.

మిత్రుడి కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయూత

నల్లమాడ,  డిసెంబరు 12: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 1997-98 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు తమ మిత్రుడు గాలిమిషన్‌ రవి మృతి చెందడంతో ఆకుటుంబానికి శనివారం ఆర్థికసాయం అందజేశారు. స్థానిక జడ్పీఉన్నత పాఠశాలలో పూర్వ వి ద్యార్థులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్‌ఐ శరత్‌చంద్ర, ఉపాధ్యాయుడు లక్ష్మన్నలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులు మాట్లాడుతూ మా మిత్రుడు రవి మృతి చెందాడని, అతని భార్య సుజాతకు తమ వంతు సాయంగా రూ. 1,07,500 ఆర్థికసాయం అందజేసినట్లు తెలిపారు. ఈ డబ్బులు మొ త్తాన్ని తమ మిత్రుని బిడ్డల చదువుల కోసం, వివాహాల కోసం కానీ వినియోగించుకోవాలని సూచించారు. మిత్రును కుటుంబం ఆపదల్లో ఉన్న సమయంలో ఆదుకున్న పూర్వ విద్యార్థులకు మృతుడు రవి భార్య, బిడ్డలు కృతజ్ఞతలు తెలియజేశారు.


Updated Date - 2020-12-13T06:40:00+05:30 IST