ఉపాధి హామీ సిబ్బందికి నోటీసులు

ABN , First Publish Date - 2020-04-14T10:39:38+05:30 IST

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మండల ఏపీఓలు రామాంజనేయులు, విజయభారతికి సోమవారం డ్వామా పీడీ

ఉపాధి హామీ సిబ్బందికి నోటీసులు

వజ్రకరూరు, ఏప్రిల్‌ 13 : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మండల ఏపీఓలు  రామాంజనేయులు, విజయభారతికి సోమవారం డ్వామా పీడీ ప్రసాద్‌ బాబు నోటీసు లు జారీ చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మండలంలోని పంచాయతీల్లో జరిగిన పనులకు పే ఆర్డర్‌, ఎఫ్‌టీఓలను నమోదు చేయలేదని, మస్టర్ల పేమెంట్‌లో నిర్లక్ష్యం వహించడంతో నోటీసులు జారీ చేశారు. గత నెల మార్చిలోనే ఏపీఓ రామాంజనేయులు, విజయభారతి పని తీరుసరిగా లేదని ఎంపీడీఓ రెహనాబేగం పీడీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. పేదలకు ఇచ్చే ఇంటి పట్టాల లేఔట్లలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల మంజూరు లో అవకతవకలు జరిగాయని ఎంపీడీఓ దృష్టికి రావడం, తదితర విషయాలపై పీడీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసు లు జారీ చేశారు. 

Updated Date - 2020-04-14T10:39:38+05:30 IST