అనంతలో యూకే టెన్షన్‌

ABN , First Publish Date - 2020-12-27T06:53:40+05:30 IST

జి ల్లాలో కరోనా ప్రభావం తగ్గిందన్న సమయం లో యూకే టెన్షన్‌ వచ్చిపడింది. గతంలోనూ మొదట్లో ఢిల్లీ, ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా కేసులు జిల్లాలో మొదలయ్యాయి. తొలుత వారిపై నిర్లక్ష్యం చేయడం వల్ల వైరస్‌ వేగంగా వ్యాపించి, వేలాది మంది దాని బారిన పడుతూ వచ్చారు.

అనంతలో యూకే టెన్షన్‌
జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ పరీక్షలకు తరలి వచ్చిన విద్యార్థులు

జిల్లాకు వచ్చిన 21మందిపై దృష్టి

ఇప్పటికే ఒకరికి పాజిటివ్‌

కాంటాక్ట్‌లపై ప్రత్యేక నిఘా

కొత్తగా నాలుగు మండలాల్లో 10 కేసులు

అనంతపురం వైద్యం, డిసెంబరు26: జి ల్లాలో కరోనా ప్రభావం తగ్గిందన్న సమయం లో యూకే టెన్షన్‌ వచ్చిపడింది. గతంలోనూ మొదట్లో ఢిల్లీ, ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా కేసులు జిల్లాలో మొదలయ్యాయి. తొలుత వారిపై నిర్లక్ష్యం చేయడం వల్ల వైరస్‌ వేగంగా వ్యాపించి, వేలాది మంది దాని బారిన పడుతూ వచ్చారు. వందలాది మంది మరణించారు. ఇప్పుడు జిల్లాలో పరిస్థితి కుదట పడింది. కేసుల సంఖ్య కూడా తగ్గింది. మళ్లీ సెకెండ్‌ వేవ్‌ మొదలైందని ప్రచారం నేపథ్యంలో యూకే నుంచి జిల్లాకు పలువురు వచ్చారు. ఈ నెలలోనే 21 మంది జిల్లాకు చేరినట్లు అధికారులే చెబుతున్నారు. యూకే నుంచి వచ్చిన వారికి కొత్త స్ర్టెయిన్‌ వైరస్‌ లక్షణాలు ఉన్నాయని ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో యూకే నుంచి జిల్లాకు వచ్చిన 21 మందికి కరో నా పరీక్షలు నిర్వహించగా.. అనంతపురం నగరానికి చెందిన ఓ మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆమెను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఆమెకు పెద్దగా లక్షణాలు లేవనీ, ఆ కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అయినా యూకే టెన్షన్‌ అధికారులను వెంటాడుతోంది. ఆ 21 మందితో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించి, వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పైగా వారందరినీ బయటకు రాకుండా హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి, చికిత్స అందిస్తున్నారు.


కొత్తగా 10 కరోనా కేసులు

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10 కరోనా కేసులు నమోదయ్యాయి. నాలుగు మండలాల్లో ఈ కేసులు రాగా.. అందులో పుట్టపర్తిలో 5, అనంతపురం 3, ధర్మవరం, కదిరిలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 67248 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 66512 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 596 మంది మరణించారు. ప్రస్తుతం 140 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-12-27T06:53:40+05:30 IST