జేఎన్‌టీయూకు జాతీయ సేవా పథకం పురస్కారాలు
ABN , First Publish Date - 2020-09-14T11:16:59+05:30 IST
భారత ప్రభుత్వం ఏటా అందించే జాతీయ సేవా పథకం పురస్కారాలు ఈఏడాది అనంత జేఎన్‌టీయూకు దక్కనున్నాయి.
జేఎన్‌టీయూ, సెప్టెంబరు 13 : భారత ప్రభుత్వం ఏటా అందించే జాతీయ సేవా పథకం పురస్కారాలు ఈఏడాది అనంత జేఎన్‌టీయూకు దక్కనున్నాయి. వర్సిటీ అనుబంధ కళాశాల పోగ్రాం ఆఫీసర్ చిన్నపుల్లయ్య, వలంటీర్ విభాగంలో నవీన్‌కుమార్ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈనెల 24న జాతీయ సేవాపథకం దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా ఆవార్డును అందుకోనున్నారు. ఈసందర్బంగా ఆవార్డు గ్రహీతలను జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్ శ్రీనివా్‌సకుమార్, రెక్టార్ భాస్కర్‌దేశాయి, రిజిస్ట్రార్ విజయకుమార్‌రెడ్డి అభినందించారు. కాగా జేఎన్‌టీయూకు జాతీయస్థాయి అవార్డు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.