గజవాహనం పై నారసింహుడి దర్శనం

ABN , First Publish Date - 2020-03-15T12:06:18+05:30 IST

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్మీ నరసింహుడు శనివారం గజవాహనంపై భ క్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నిత్యపూజ, హోమం అనంతరం

గజవాహనం పై నారసింహుడి దర్శనం

కదిరి, మార్చి 14: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్మీ నరసింహుడు శనివారం గజవాహనంపై భ క్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నిత్యపూజ, హోమం  అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. సంధ్యాసమయంలో గజవాహనంపై శ్రీవారు ఊరేగారు. శ్రీమహావిష్ణు దశావతారాల్లో భాగమైన నారసింహుడికి దేవేంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని పంపుతారని భక్తుల నమ్మకం. తెల్లవారితే బ్రహ్మరథోత్సవం ఉండడంతో ఆలయ ప్రాంగణంతో పాటు తిరువీధులన్నీ భక్తులతో క్రిక్కిరిసి పోయాయి. ఆలయ నిర్వాహకులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.


అలాగే వారికి వినోదం అందించడానికి ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఉత్సవం ముందు భాగంలో జానపద కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో ఆలయ చైర్మన్‌ కాంబోజి రెడ్డెప్పశెట్టి, ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-15T12:06:18+05:30 IST