వ్యక్తి హత్య... వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే !

ABN , First Publish Date - 2020-03-19T10:52:06+05:30 IST

మండలంలోని ఆవుల తిప్పాయపల్లి వద్ద ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్‌ కూలీ శేఖర్‌ (42) హత్యకు గురైనట్టు పోలీసులు బుధవారం తెలిపా రు.

వ్యక్తి హత్య... వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే !

తాడిపత్రిరూరల్‌, మార్చి18 : మండలంలోని ఆవుల తిప్పాయపల్లి వద్ద  ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్‌ కూలీ శేఖర్‌ (42) హత్యకు గురైనట్టు పోలీసులు బుధవారం తెలిపా రు. మృతుడి అక్క లక్ష్మీకాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేర కు పట్టణంలోని పప్పూరురోడ్డులో ఉన్న సీపీఐ కొట్టాలలో నివాసం ఉంటున్న శేఖర్‌ ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్‌లో కూలీ గా పని చేస్తుండేవాడు. అదేకాలనీలో ఉంటున్న బలరా ముడుతో శేఖర్‌కు స్నేహం ఉంది. గతంలో ఇద్దరూ ఒకే ఆటోను పగలు, రాత్రివేళల్లో నడిపేవారన్నారు. కొంతకా లం కిందట శేఖర్‌ వాటర్‌ప్లాంట్‌లో కూలీగా మారాడు. శేఖర్‌తో ఉన్న స్నేహం నేపథ్యంలో అతడి భార్య నాగమ్మ తో బలరాముడుకి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగా యి.


తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న శేఖర్‌ను తొలగించుకొనేందుకు నాగమ్మతోపాటు బలరాముడు పథకం వేశారన్నారు. అందులో భాగంగా శేఖర్‌కు మాయ మాటలు చెప్పి నాగమ్మ తలారిచెరువు వద్ద గల పెద్దమ్మ దేవాలయానికి మోటార్‌సైకిల్‌పై తీసుకువెళ్లిందన్నారు. మార్గమధ్యలో వేచిఉన్న బలరాముడు క్రికెట్‌ బ్యాట్‌తో శేఖర్‌ తలపై పలుమార్లు బాదడంతో అక్కడికక్కడే చనిపోయాడన్నారు. అనంతరం బలరాముడు, నాగమ్మ పరారయ్యారన్నారు. మృతుడి అక్క ఫిర్యాదు మేరకు బలరాముడు, నాగమ్మలపై కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-03-19T10:52:06+05:30 IST