యువకుడి హత్య

ABN , First Publish Date - 2020-12-25T06:57:23+05:30 IST

మండలంలోని గుడిసెలు గ్రామ చెక్‌డ్యాం వద్ద యువకుడు భాస్కర్‌రెడ్డి (22) గురువారం హత్యకు గురయ్యాడు.

యువకుడి హత్య

గుడిసెలు గ్రామ చెక్‌డ్యాం వద్ద ఘటన

ప్రమాదంగా సృష్టించి తప్పించుకునే యత్నం


యాడికి, డిసెంబరు 24: మండలంలోని గుడిసెలు గ్రామ చెక్‌డ్యాం వద్ద యువకుడు భాస్కర్‌రెడ్డి (22) గురువారం హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డి వడ్లు ఆడించు ట్రాక్టర్‌ బాడుగలకు వెళ్తూ జీవనం సాగించేవాడు. ఉదయం చండ్రాయునిపల్లిలో బాడుగకు వెళ్లి గుడిసెలు గ్రా మానికి వస్తున్నాడు. గ్రామ సమీపంలో కొందరు వ్య క్తులు ట్రాక్టర్‌ ఆపి భాస్కర్‌రెడ్డి గొంతుకోసి చంపా రు. మృతదేహాన్ని పక్కనే ఉన్న చెక్‌డ్యాం నీటిలో పడుకోబెట్టారు. ట్రాక్టర్‌ను రోడ్డుపై నుంచి చెక్‌డ్యాంలోకి తోసేసి హత్య ఘటనను ప్రమాదంగా సృష్టించి తప్పించుకునే యత్నం చేశారు. గతంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని సమీప బంధువులే భాస్కర్‌రెడ్డిని చంపి, ప్రమాదంగా సృష్టించాలని ఇ దంతా చేశారని మృతుడి తండ్రి బాలకృష్ణారెడ్డి పో లీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ తనిఖీలు చేసి ఆ ధారాలు సేకరించే ప్రయ త్నం చేశారు. మృతదేహా న్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనలో ఆ రుగురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2020-12-25T06:57:23+05:30 IST