భార్యను హత్య చేసిన భర్త

ABN , First Publish Date - 2020-07-15T09:52:04+05:30 IST

మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో భాగ్యమ్మ(36)ను భర్త వెంకటే్‌షబాబు..

భార్యను హత్య చేసిన భర్త

మడకశిర రూరల్‌, జూలై 14: మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో భాగ్యమ్మ(36)ను భర్త వెంకటే్‌షబాబు హత్యచేసినట్లు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు. భాగ్యమ్మ బంద్రేపల్లి క్లస్టర్‌లో వలంటీర్‌గా పనిచేస్తోంది. భార్యభర్తల గొడవతో భాగ్యమ్మను హత్యచేసినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతురాలి తల్లిదండ్రులు హనుమంతరాయప్ప, లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2020-07-15T09:52:04+05:30 IST