యువకుడి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు

ABN , First Publish Date - 2020-12-19T06:25:44+05:30 IST

మండలంలోని చిన్నచిగుళ్లరేవు వద్ద గురువారం గల్లంతైన యువకుడు రాజు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

యువకుడి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు

తాడిమర్రి, డిసెంబరు 18: మండలంలోని చిన్నచిగుళ్లరేవు వద్ద గురువారం గల్లంతైన యువకుడు రాజు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం ఉద యం నుంచి స్థానిక ఎస్‌ఐ శ్రీహర్షతోపాటు ధర్మవరం నుంచి హాజరైన ఫైర్‌ సిబ్బందితో బోట్లలో చిత్రావతి నదిలోకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం సా యంత్రం 7గంటల సమయానికి కూడా ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. తిరిగి శనివారం ఉదయం  గాలింపు చర్యలు చేపట్టనున్నారు. ఫైర్‌సిబ్బందితోపాటు గ్రామంలోని యువకులు కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.


Read more