-
-
Home » Andhra Pradesh » Ananthapuram » MP
-
చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రణాళిక : ఎంపీ
ABN , First Publish Date - 2020-05-13T10:17:45+05:30 IST
జిల్లాలో చేనేత రంగాన్ని అన్నివిధాలా ఆదుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని

అనంతపురం అర్బన్, మే 12 : జిల్లాలో చేనేత రంగాన్ని అన్నివిధాలా ఆదుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన స్థానికంగా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులుతో కలసి నాబార్డ్, చేనేత జౌళిశాఖ, ఏడీసీసీ బ్యాంక్ అధికారులతో సమీక్షించారు. చేనేతలను ఆదుకునేందుకు వైఎస్సార్ నేత న్న నేస్తం పేరుతో రూ.24వేల ఆర్థిక సాయాన్ని ప్రతి కు టుంబానికి అం దించామన్నారు.
లాక్‌డౌన్ నేతన్నలపై తీవ్రప్రభావం చూపిందన్నారు. ముద్ర, స్వయం ఉపాధి వంటి పథకాల కింద నాబార్డు, ఏడీసీసీ బ్యాంకు అధికారులు చేనేతలకు రుణాలు మంజూరుచేస్తే ఆ రంగం ఆర్థికంగా పుంజుకోవడానికి వీలుంటుందన్నారు. ముఖ్యంగా ముడిసరుకు పెట్టుబడికి ఈ రుణాలు ఎంతో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ కోడూ రు రామప్ప, ఏడీసీసీ బ్యాంక్ సీఈఓ రామ్‌ప్రసాద్, ఏజీఎం, నాబార్డు ఏజీఏం పాల్గొన్నారు.