కరోనాపై ఆందోళన వద్దు

ABN , First Publish Date - 2020-03-24T10:33:35+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తు న్న కరోనా వైర్‌సపై ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇం టికే పరిమితమై జాగ్రత్తలు పాటిస్తే కరోనాను పారదోలవచ్చని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

కరోనాపై ఆందోళన వద్దు

ముందు జాగ్రత్తలతో అరికడదాం

అధికారులతో ఎమ్మెల్యే బాలకృష్ణ  


హిందూపురం, మార్చి 23: ప్రపంచాన్ని వణికిస్తు న్న కరోనా వైర్‌సపై ప్రజలు  ఆందోళన చెందవద్దని, ఇం టికే పరిమితమై జాగ్రత్తలు పాటిస్తే కరోనాను పారదోలవచ్చని  ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలో కరోనా వైరస్‌ నియంత్రణకు చేపడుతున్న అంశాలపై ఎమ్మెల్యే మునిసిపల్‌ కమిషనర్‌ భవానీప్రసాద్‌, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కేశవులతో ఫోన్‌లో చర్చించారు.  పట్టణంలో పారిశుధ్య పనులు మె రుగుపరచాలని, ప్రతి కార్మికుడికి మాస్కులు, పరికరాలను సమకూర్చాలని కమిషనర్‌కు సూచించారు. 


కరో నా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.  వ్య క్తిగత, పరిసరాల పరిశుభ్రతలపై చర్యలు చేపట్టి పట్టణంలో ఎక్కడ అపరిశుభ్రత కనిపించకుండా చూడాల న్నారు.  ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌తో పాటు ఆసుపత్రిలో మందులు, వైద్యులు, సి బ్బంది అన్ని వేళల్లో అందుబాటులో ఉండేట్లు చూడాల ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కేశవులకు సూచించారు.  కరోనా నియంత్రణకు సేవలు అందిస్తున్న వైద్యులతో పాటు సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులకు ప్రతే ్యకంగా కృతజ్ఞతలు తెలిపారు.  

Read more