కియలో 75 శాతం ఉద్యోగాలు

ABN , First Publish Date - 2020-07-10T10:23:30+05:30 IST

కియ దాని అనుబంధ కంపెనీల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ కంపెనీ..

కియలో 75 శాతం ఉద్యోగాలు

స్థానికులకే కల్పించాలి : మంత్రి 


పెనుకొండ రూరల్‌, జూలై 9 : కియ దాని అనుబంధ కంపెనీల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. గురువా రం మండలంలోని దుద్దేబండ క్రాస్‌ సమీపంలో నిర్మితమైన కియ అ నుబంధ పరిశ్రమలను ఆయన పరిశీలించారు. కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ఉద్యోగ కల్పనపై ఆరాతీశారు. పరిశ్రమల్లో స్థానికులకే ఉ ద్యోగ అవకాశాలు కల్పించేలా చూడాలని కంపెనీ ప్రతినిధులకు సూ చించారు. ఈ కార్యక్రమంలో జేసీ-3 పద్మావతి, పరిశ్రమల జీఎం సుదర్శన్‌బాబు, డీఎ్‌సపీ మహబూబ్‌బాషా, తహసీల్దార్‌ నాగరాజు, సీఐ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-10T10:23:30+05:30 IST