అసమానతలు రూపుమాపిన మహనీయుడు అంబేడ్కర్
ABN , First Publish Date - 2020-12-07T06:26:50+05:30 IST
సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలను రూపుమాపిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు.

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు 6 : సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలను రూపుమాపిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గా లు, దళితులు సమాజంలో గౌరవమైన స్థానం పొందేలా అంబేడ్కర్ రాజ్యాంగ రూపకల్పన చేశారని కొనియాడా రు. తమ ప్రభుత్వం కూడా అంబేడ్కర్ మార్గదర్శకత్వంలో నడుస్తోందన్నారు. ఇందులో భాగంగానే పేదలు, అణగారిన వర్గాలకు గత 18 నెలల కాలంలో దాదాపు రూ.58 వేల కోట్లు లబ్ధి చేకూర్చామన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ అంబేడ్కర్ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కారణంగా నేడు అనేకమంది అణగారినవర్గాలవారు ఉన్నత పదవులు అధిరోహించారన్నారు. కార్యక్రమంలో జేసీ గంగాధర్‌గౌడ్, ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ విశ్వమోహన్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ యుగంధర్, గిరిజన సంక్షేమశాఖాధికారి అన్నాదొరై తదితరులు పాల్గొన్నారు.