ఉనికిని కాపాడుకునేందుకే జగన్‌పై విమర్శలు

ABN , First Publish Date - 2020-12-13T06:36:08+05:30 IST

రాష్ట్రంలో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌పై బురదజల్లుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ విమర్శించారు. రొద్దం ప్రభుత్వ ఆసుపత్రిలో 20పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణం కోసం రూ.1.80కోట్ల నిధులతో భూమిపూజ నిర్వహించారు.

ఉనికిని కాపాడుకునేందుకే జగన్‌పై విమర్శలు

మంత్రి శంకరనారాయణ 

20 పడకల ఆసుపత్రి భవనానికి భూమిపూజ 

రొద్దం, డిసెంబరు 12: రాష్ట్రంలో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌పై బురదజల్లుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ విమర్శించారు. రొద్దం ప్రభుత్వ ఆసుపత్రిలో 20పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణం కోసం రూ.1.80కోట్ల నిధులతో భూమిపూజ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పేద ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉంటే టీడీపీ వారు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 16మెడికల్‌ కళాశాలలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రొద్దంలో ఎంజేపీ పాఠశాల నిర్మాణం కోసం రూ.15 కోట్ల నిధులతో త్వరలోనే భూమిపూజ చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, రొద్దం వైద్యాధికారి రోహిల్‌కుమార్‌, కన్వీనర్‌ బీ నారాయణరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌, లక్ష్మీనారాయణరెడ్డి, కేపీ శ్రీనివాసులు, కలిపి శ్రీనివాసులు, అమీర్‌బాష, వజీర్‌బాష, ఎంపీహెచ్‌ఈఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. Updated Date - 2020-12-13T06:36:08+05:30 IST