రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌

ABN , First Publish Date - 2020-11-21T05:51:17+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు.

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

అనంతపురం, నవంబరు 20(ఆంద్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి వ స్తే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ ఉల్లంఘిస్తున్నారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉండి ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరించడం ఆయనకు తగదన్నారు. ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చిన వారి కోసం పదవీకాలం ముగిసేలోపు కానుక ఇచ్చేందుకు రాష్ర్టాన్ని తాకట్టు పెట్టే ఆలోచన చేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఉందో లేదో నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ నిర్ణయించుకోవాలన్నారు. చ ట్టబద్ధంగా పనిచేయాలనుకుంటే కోర్టులు, గవర్నర్‌ చుట్టూ తిరగడం కాకుండా ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. నిమ్మగడ్డ ఒంటెద్దు పోకడలకు పోవడం సమంజసంకాదన్నారు. ఇదే సందర్భంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలపై ఆయన స్పందించారు. తిరుపతి ఉప ఎన్నికలో 3 లక్షల పైచిలుకు మెజార్టీతో తమ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read more