ఆస్పత్రిలో అర్ధరాత్రి అలజడి

ABN , First Publish Date - 2020-04-25T10:13:05+05:30 IST

జిల్లా సర్వజనా స్పత్రిలో మరోసారి అర్ధరాత్రి వరకూ అలజడి కొనసాగిం ది.

ఆస్పత్రిలో అర్ధరాత్రి అలజడి

క్వారంటైన్‌కు డాక్టర్లు, నర్సులు

ఎస్‌ఆర్‌ఐటీకి తరలింపుపై తిరుగుబాటు

వసతుల విషయంపై వైద్యాధికారులతో వాగ్వాదం

చివరకు జేఎన్‌టీయూలో వసతి


అనంతపురం వైద్యం, ఏప్రిల్‌24 : జిల్లా సర్వజనా స్పత్రిలో మరోసారి అర్ధరాత్రి వరకూ అలజడి కొనసాగింది. తాజాగా మరో నర్సుకు కరోనా పాజిటివ్‌ రావడమే కారణం. అప్రమత్తమైన వైద్యాధికారులు అనుమానితులుగా ఉన్న పలువురు వైద్యులు, నర్సులను క్వారంటైన్‌కు తరలించడానికి నిర్ణయించుకున్నారు. జిల్లా అధికారుల ఆమోదంతో క్వారంటైన్‌కు వెళ్లాల్సిన డాక్టర్లు, నర్సులు, ఇతర టెక్నీషియన్లను పిలిపించారు. వారిని అంబులెన్స్‌లో ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కళాశాల క్వారంటైన్‌ వద్దకు తీసుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో అక్కడికి వెళ్తే కనీసం  ప్రధాన గేటు తెరిచే వారు కూడా లేరు. ప్రాణాలు తెగించి వైద్యసేవలు అందిస్తున్న తమను సామాన్యులు ఉంటున్న క్వారంటైన్‌కు తీసుకొస్తారా అంటూ డాక్టర్లు, నర్సులు తిరుగుబాటుకు దిగారు. ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల వద్దనే తమ నిరసన తెలిపారు. అక్కడి నుంచి తిరిగి జిల్లా సర్వజనాస్పత్రికి చేరుకున్నారు. ఇక్కడ సూపరింటెండెంట్‌, ఇతర వైద్యాధికారులతో డాక్టర్లు, నర్సులు వాగ్వాదానికి దిగారు.


కరోనా నియంత్రణకు శ్రమిస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. డాక్టర్లు, నర్సులకు ప్రత్యేక క్వారంటైన్‌లు నగరంలో ఏర్పాటు చేస్తాం. అన్ని వసతులు కల్పిస్తామని గొప్పలు చెప్పారు. ఇప్పుడేమో సాధారణ వ్యక్తులు మాదిరిగానే మమ్ములను భావించి ఏదో ఒక చోట పారేసి రావాలని చూస్తారా అంటూ ఆస్ప త్రి అధికారులపై మండిపడ్డారు. అదే సమయంలో ట్రైనీ కలెక్టర్‌ జాహ్నవి ఆస్పత్రికి చేరుకున్నారు. డాక్టర్లు, నర్సులు  తమ వేదనను ట్రైనీ కలెక్టర్‌కు తెలిపారు. వారి బాధను విని ఆస్పత్రి అధికారుల తీరుపై ఆమె కూడా మండి పడ్డారు. చివరకు అన్ని వసతులు ఉన్నచోటకు పంపుతా మని ట్రైనీ కలెక్టర్‌ హామీ ఇచ్చారు. దీంతో డాక్టర్లు, నర్సు లు శాంతించారు. ఆ తర్వాత శుక్రవారం తెల్లవారు జా మున జేఎన్‌టీయూ కళాశాలకు డాక్టర్లు, నర్సులను తీసు కెళ్లి వసతి కల్పించారు. ఇదిలాఉండగా శుక్రవారం మరొక 15 మంది వరకూ డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్‌లను జేఎన్‌టీయూలోని క్వారంటైన్‌కు తరలించారు. దాదాపు అక్కడ 30 మంది వరకూ ఉన్నారు.

Updated Date - 2020-04-25T10:13:05+05:30 IST