కనికరం లేకుండా షాపులు, ఇళ్లు సీజ్‌ చేశారు

ABN , First Publish Date - 2020-12-15T06:40:09+05:30 IST

‘మాకు కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులున్నాయి. వాటిని వేలం వేసుకుని అప్పునకు జమ చేసుకోవాలని ఎస్‌ఎఎఫ్‌సీ అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. మా ఇళ్లు, షాపులను సీజ్‌ చేశారు’ అని ఓ బాధితుడు శ్రీధర్‌ సోమవారం ఆంధ్రజ్యోతితో ఆవేదఽన వెలిబుచ్చారు.

కనికరం లేకుండా షాపులు, ఇళ్లు సీజ్‌ చేశారు
ఆంధ్రజ్యోతితో మాట్లాడుతున్న శ్రీధర్‌


కోట్ల విలువైన భూములు వేలం వేసుకోమన్నా వినలేదు

-ఫైనాన్స్‌ వేధింపులతోనే మా అన్న అకాల మరణం

-బాధితుడు శ్రీధర్‌ ఆవేదన


పుట్టపర్తి, డిసెంబరు 14 : ‘మాకు కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులున్నాయి. వాటిని వేలం వేసుకుని అప్పునకు జమ చేసుకోవాలని ఎస్‌ఎఎఫ్‌సీ అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. మా ఇళ్లు, షాపులను సీజ్‌ చేశారు’ అని ఓ బాధితుడు శ్రీధర్‌ సోమవారం ఆంధ్రజ్యోతితో ఆవేదఽన వెలిబుచ్చారు. బాదితుడు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 2006లో అనంతపురం శ్రీరామ్‌ చిట్స్‌లో పుట్టపర్తికి చెందిన శ్రీధర్‌, ఆయన అన్న రెడ్డి సత్యనారాయణ తమ ఆస్తు లపై రూ. కోటి అప్పుతీసుకున్నారు. వాటిని వన్‌టైం సెటిల్‌మెం ట్‌ కింద రూ.1.20కోటి చెల్లించేందుకు ఎస్‌ఎఫ్‌సీ అధికారులు ముందుకొచ్చారు. 2008లో హిందూపురంలోని పైర్‌బ్రిక్స్‌ ఫ్యాక్టరీ పైన రూ.70లక్షలు, అనంతపురంలోని యూత్‌ఫ్యాషన్స్‌పేరిట డమ్మీ ఖాతాలో రూ.30లక్షలు రుణం మంజూ రుచేశారు. ఇందులో కేవలం రూ.70లక్షలను శ్రీరామ్‌చిట్స్‌కు చెల్లించారు. కొంతకాలం కంతులు చెల్లించినా.. కరోనా వైరస్‌ తో రుణం వాయిదాలుగా చెల్లించలేకపోయారు. దీంతో తీసు కున్న అప్పు వడ్డీ, అసలు కలిసి రూ.2.60కోట్లకు చేరుకుంది. దీంతో కొంత గడువు ఇమ్మని కోరుకున్నా స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారులు నిర్దాక్షిణ్యంగా రెండు రోజుల క్రితం తమకు చెందిన షాపులు, ఇళ్లుసీజ్‌ చేశారని శ్రీధర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు కంటే నాలుగు రెట్లు విలువైన ఆస్తులు ఉన్నాయని, భూమిని వేలం వేసుకోమన్నా వారు పట్టించు కో లేదన్నారు. దీంతో అసలే అనారోగ్యంతో బాధప డుతున్న తన అన్న రెడ్డిసత్యనారాయణ మరింత కుంగిపోయి ఆదివారం అకాలమృ తిచెందారని  ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ సంస్థలు వేలకోట్ల రుపాయిలు బ్యాంకులకు ఎగగొట్టిన వారిని ఏమిచేయలేవని, తమ లాంటి మద్యతరగతి కుటుంబాలపై ఎస్‌ఎఫ్‌సీ అధికారులు చేసిన అమానుష చర్యతో కుటుంబ పెద్దను కోల్పోయామని అన్నారు. దీనికి సరైన న్యాయం చేయాలని ఆయన కోరారు.


Updated Date - 2020-12-15T06:40:09+05:30 IST