‘పురం’లో విస్తరిస్తున్న మట్కా
ABN , First Publish Date - 2020-11-03T06:56:46+05:30 IST
సామాన్య, మధ్యతరగతి కుటుం బాలను నాశనం చేసే మట్కా హిందూపురంలో రోజు రోజు కు విస్తరిస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
- అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్న నిర్వాహకులు
- కర్ణాటక నుంచి కూడా మట్కాపట్టీలు తెప్పించుకుంటున్న వైనం
- కిందస్థాయి సిబ్బంది అండదండలు పుష్కలం
హిందూపురం టౌన, నవంబరు 2 : సామాన్య, మధ్యతరగతి కుటుం బాలను నాశనం చేసే మట్కా హిందూపురంలో రోజు రోజు కు విస్తరిస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. కొంతకాలం వరకు స్తబ్ధుతగా ఉన్న మట్కా నిర్వాహకులు, బీటర్లు ఇటీవల కాలంలో బరితెగించి ప్రధాన కూడళ్లలోనే మట్కా పట్టీలు రా స్తున్నారంటే వారికి ఏ స్థాయిలో అండదండలు ఉన్నాయో ఇట్టే అర్థం అవుతోం ది. కొంతకాలం క్రితం హిందూపురంలో పేరుమోసిన మట్కా నిర్వా హకులను జిల్లా ఎస్పీ పిలిపించుకొని తనదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో కొంత కాలంగా వారు స్తబ్ధంగా ఉన్నారు. తరువాత ఒకరిద్దరు పేరుమోసిన మట్కా నిర్వాహకులు అధికార పార్టీలోకి చేరారు. కేవలం వారి వ్యవహారాలు సజావుగా సాగాలనే ఉద్దేశ్యం తోనే కండువాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలోకి చేరకముందు వారిపై పోలీసులు గట్టి నిఘా ఉంచేవారు. అంతేకాక పలుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే అధికార పార్టీలోకి చేర డంతో పోలీస్ అధికారులు కూడా మిన్నకుం డిపోయారని విమర్శ లున్నాయి. తరువాత దాడి చేస్తే ఎక్కడ ఇబ్బంది తలెత్తుతుందోనని పోలీసులు చర్యలు తీసుకోలేదన్న ఆరో పణలు ఉన్నాయి. ఇదే అదునుగా భావించిన నిర్వాహకులు తరచూ అధికార పార్టీ కార్యక్ర మాల్లో పాల్గొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మహమ్మారి మట్కా చాప కింద నీరులా విస్తరిస్తోందని అనడంలో సందేహం లేదు. ప్రతిరోజూ ప ట్టణంలో రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల కుపైగా మట్కా జరు గుతోందంటే అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే మట్కాడానగా పేరుగాంచిన నిర్వాహకులు కర్ణాటక నుంచి పట్టీలు తెప్పించు కుం టున్నారంటే వారు ఎంతకు బరితెగించారో అర్థం అవు తోంది. పైకి మాత్రం మేము మట్కా వదిలేశామని చెబుతున్నా వారి ఆట మా త్రం ఆగలేదన్నది అక్షర సత్యం. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను దూరంగా ఉంచితే బాగుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.