శాకాంబరి మాతా.. కరుణించమ్మా!

ABN , First Publish Date - 2020-07-18T10:38:55+05:30 IST

పట్టణంలోని మస్తాన్‌పేటలో వెలసిన మారెమ్మ అమ్మవా రు శుక్రవారం శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

శాకాంబరి మాతా.. కరుణించమ్మా!

 గుంతకల్లుటౌన్‌, జూలై17: పట్టణంలోని మస్తాన్‌పేటలో వెలసిన మారెమ్మ అమ్మవా రు శుక్రవారం శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకుడు రాఘవేంద్ర అమ్మవారికి వివిధ రకాల పూలతో అలంకరణ చేసి, పూజలు గావించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బలరామయ్య, నరసింహులు, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


తాడిపత్రిటౌన్‌: పట్టణంలోని కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో శుక్రవారం వాసవీమాత శాకాంబరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  


యాడికి: మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి శుక్రవారం శాకాంబరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలు కూరగాయలు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించారు. 

Updated Date - 2020-07-18T10:38:55+05:30 IST