వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-18T05:30:00+05:30 IST

మండలంలోని విట్లంపల్లి గ్రామానికి చెందిన దివ్య (22) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది.

వివాహిత ఆత్మహత్య

కళ్యాణదుర్గం, సెప్టెంబరు 18 : మండలంలోని విట్లంపల్లి గ్రామానికి చెందిన దివ్య (22) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు మూడేళ్ల కిందట తిమ్మప్పతో వివాహం జరిగింది.  బీటెక్‌ పూర్తి చేసిన దివ్య నంద్యాలలో బ్యాంకు కో చింగ్‌కు వెళ్లింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరిగి పుట్టినిల్లు గూబనపల్లికి వచ్చింది.


ఇటీవల కడుపునొప్పి అధికం కావడంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో శుక్రవారం కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో తట్టుకోలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ సుధాకర్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-18T05:30:00+05:30 IST