అమాత్యుడికీ పట్టని భౌతికదూరం

ABN , First Publish Date - 2020-07-28T19:06:15+05:30 IST

కూడేరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన..

అమాత్యుడికీ పట్టని భౌతికదూరం

అనంతపురం(ఆంధ్రజ్యోతి): కూడేరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్‌ కార్యాలయ భవనాన్ని సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి జిల్లాలో ఉధృతంగా ఉన్న నేపథ్యంలో... భౌతికదూరాన్ని పాటిస్తూ.. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన నిర్వాహకులు ఆ విషయాన్ని మరిచారు. ఎక్కడా భౌతికదూరం ఆ కార్యక్రమంలో కనిపించలేదు. అమాత్యుడికీ ఆ విషయం పట్టలేదు. కార్యక్రమం ప్రారంభం నుంచి.. చివరికి మీడియా సమావేశం వరకు మంత్రితోనే వందలాది మంది నాయకులు, కార్యకర్తలు భౌతికదూరానికి తిలోదకాలిస్తూ అంటకాగారు. ఇలా అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదా అని అక్కడున్న సామాన్య జనం చర్చించుకోవడం విశేషం.

Updated Date - 2020-07-28T19:06:15+05:30 IST