ఇరుముడులు సమర్పించిన మాలధారులు

ABN , First Publish Date - 2020-12-27T05:58:54+05:30 IST

హనుమాన్‌ దీక్ష స్వీకరించిన భక్తులు శనివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ఇరుముడులు సమర్పించారు

ఇరుముడులు సమర్పించిన మాలధారులు
అగ్ని హోత్రంలో సమిధలు వేస్తున్న దీక్షాపరులు


గుంతకల్లు, డిసెంబరు 26: హనుమాన్‌ దీక్ష స్వీకరించిన భక్తులు శనివారం  కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ఇరుముడులు సమర్పించారు. నవంబరులో మండల దీక్ష, ఈనెలలో అర్ధ మండల దీక్ష చేపట్టిన భక్తులు దీక్షా కాలం పూర్తవుతుండటంతో ఇరుముడులు ధరించి కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. కరోనా ప్రతిబంధకాలు ఉండటంతో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం ఆలయ ఆధికారులు గుంతకల్లు నుం చి స్వామివారి ఊరేగింపును రద్దుచేశారు. దీంతో భక్తులు ఎవరికివారు ఆలయానికి చేరుకుని ఇరుముడులు ఇచ్చారు. ఆలయం తూర్పుదిక్కు గోపురం వద్ద ఏర్పాటుచేసిన హోత్రంలో నెయ్యి, నారికేళాలను సమిధలుగా వేశారు. ఆలయ ఈఓ రామాంజనేయులు మాట్లాడుతూ కరోనా కారణంగా ఆదివారం నిర్వహించనున్న హనుమద్వ్రతానికి భారీ ఏర్పాట్లు చేయలేదన్నారు. ఆలయ ఆవరణలో స్వామివారిని అలంకరించి కొలువుదీర్చి పూజలు నిర్వహిస్తామని, మాలధారులు స్వామివారిని ఒకరితర్వాత ఒకరుగా దర్శించుకుని అర్చకుల ఆ ధ్వర్యంలో మాలలను విసర్జించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ మ ధు, సూపరింటెండెంట్‌ పిడికిటి వెంకటేశ్వర్లు, ఆలయ ధర్మకర్తల మండలి అ ధ్యక్షురాలు కే సుగుణమ్మ, సభ్యులు త్యాగరాజు, గుంతా రమేశ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-27T05:58:54+05:30 IST