నేడు రాజధాని వికేంద్రీకరణపై నిరసన

ABN , First Publish Date - 2020-08-01T09:48:42+05:30 IST

రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌ బిశ్వభూషణ్‌హరిచందన్‌ ఆమోదించడం ప్రజావ్యతిరేకమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ..

నేడు రాజధాని వికేంద్రీకరణపై నిరసన

నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఉమా


కళ్యాణదుర్గం, జూలై 31 : రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌ బిశ్వభూషణ్‌హరిచందన్‌ ఆమోదించడం ప్రజావ్యతిరేకమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌ నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ శనివారం కళ్యాణదుర్గంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఓత్తిడి మేరకే గవర్నర్‌ మూడు రాజధానుల వికేంద్రీకరణను ఆమోదించిండం సరైన వైఖరి కాదన్నారు.  ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టే నిరసన కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. 


కార్యకర్తల కు టుంబాలకు టీడీపీ అండ : కష్టాల్లో ఉన్న కార్యకర్తల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వరనాయుడు భరోసా ఇచ్చారు. శుక్రవారం బ్రహ్మసముద్రం మండలం ఎర కొండాపురం గ్రామానికి చెందిన కార్యకర్త బోయహనుమప్ప, శెట్టూరు మండలం కనుకూరు గ్రామానికి చెందిన చౌడప్ప వివిధ కారణాలతో మృతి చెందారు.


విషయం తెలుసుకున్న ఉమా ఆయా గ్రామాలకు వెళ్లి మృతుల భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. దహన కార్యక్రమాల నిమిత్తం చంద్రన్న స్ఫూర్తితో ఆర్థిక సాయాన్ని అందించారు. అలాగే  అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ జడ్పీటీసీ గంగమ్మ, పోబ్బర్లపల్లికి చెందిన తిప్పేస్వామిలను పరామర్శించారు. కార్యక్రమంలో దొడగట్ట నారాయణ, మాదినేని మురళి, సత్యప్ప, శ్రీరాములు, తిప్పారెడ్డి, ధనుంజయ, నగేష్‌, రంగప్పచౌదరి, శ్రీనివాసులు, జయరాములు వెంకటేశులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-01T09:48:42+05:30 IST