లాక్ లక్ష్యం డౌన్
ABN , First Publish Date - 2020-04-26T11:03:01+05:30 IST
జిల్లాలో లాక్‌డౌన్ లక్ష్యం నీరుగారుతోంది. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం లేదు.

ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వాహనదారులు
రెడ్‌జోన్లలోనూ కప్పదాట్లు
మాల్స్, మార్కెట్‌లు, కిరాణా కొట్లు కిటకిట
ప్రజల్లో భయం, బాధ్యత పెంచని పోలీసు చలా నాలు
అనంతపురం,ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో లాక్‌డౌన్ లక్ష్యం నీరుగారుతోంది. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం లేదు. భౌతిక దూరం పట్టిం చుకోవడం లేదు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతు న్నా ప్రజలు బాధ్యతను గుర్తించలేకపోతున్నారు. నిత్యావ సర సరుకులు, కూరగాయలు, పాలు, పండ్లు, మందులు కొనుగోలు కోసం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపును కొందరు దుర్విని యోగం చేస్తున్నారు. ఆ సమయంలో వందల సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. ద్విచక్ర వాహనదారులతో ప్రధాన రహదారులన్నీ సాధారణ రోజులను గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ద్విచక్ర వాహనదారులపై చలా నా రూపంలో జరిమానాలు విధిస్తున్నారు. చలానాలు సైతం జనాల్లో భయాన్ని పెంచడం లేదు.
ఇలా అయితే కరోనా వైరస్ వ్యాప్తిని ఎలా అరికట్టాలి. ప్రజల ప్రాణా లను ఎలా కాపాడాలన్న నిర్వేదం కొందరు పోలీసుల నుంచి వ్యక్తమవుతుండటం క్షేత్రస్థాయిలో పరిస్థితికి అద్దం పడుతోంది. లాఠీ ఝళిపించినా కొందరు యువకుల్లో మా ర్పు రాకపోవడం బాధిస్తోందన్న అభిప్రాయం ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులే పిల్లలను ఇళ్ల నుం చి బయటకు రాకుండా చూసుకోవాల్సి ఉందంటున్నారు. శనివారం జిల్లాలో హిందూపురంలో మాత్రమే కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. పోలీసులు ప్రధాన కూడళ్లలో బందోబస్తులో ఉన్నా ధర్మవరం, తాడిపత్రి, రాయదు ర్గం, పెనుకొండ కదిరి ప్రాంతాల్లో ద్విచక్ర వాహనదారులు రోడ్లపై సినిమా పక్కీలో రయ్... రయ్... అంటూ దూసు కుపోవడం కనిపించింది. జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో జన జాతర కొనసాగింది. ఆ రోడ్డు కిక్కిరిసిపోయిం ది. అదే రోడ్డులో ఉన్న నిత్యావసర సరుకుల దుకాణాలు జనంతో నిండిపోయాయి.
రామ్‌నగర్‌లోనూ జనం రద్దీ పెరిగిపోతోంది. మాల్స్‌కు జనం ఎగబడుతున్నారు. కూర గాయల మార్కెట్‌లు కిటకిటలాడాయి. దుకాణాల ముం దు వ్యక్తికి, వ్యక్తికి మధ్య దూరం పాటించేలా గడులు ఏర్పాటుచేసినా ప్రజలు అవేమీ పట్టించుకోలేదు. ఎంత సేపూ కూరగాయలు కొనుగోలు చేయాలన్న ధ్యాసలోనే ఉండిపోయారు తప్ప కరోనా బారినుంచి రక్షించుకోవాల న్న బాధ్యతను విస్మరించారు. కళ్యాణదుర్గం, అనంతపురం లోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో కప్పదాట్లు కొనసాగాయి. కొందరు పోలీసుల కళ్లుగప్పి బారికేడ్లు దాటి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో కరోనా మరింత విస్తరించ కుండా ఉండాలంటే పోలీసులు మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సి ఉంది. లేదంటే పరిస్థితి చేయిదాటే ప్రమాదం పొంచి ఉంది.