-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Light for future generations by saving electricity
-
విద్యుత్‌ను పొదుపుతో భవిష్యత్ తరాలకు వెలుగు
ABN , First Publish Date - 2020-12-15T06:41:38+05:30 IST
విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటే భవిష్యత్ తరాలకు వెలుగు నివ్వవచ్చని ఏపీఎస్‌పీడీసీ ఎల్ ఎస్‌ఈ వరకుమార్ అన్నారు.

గ్రామస్థాయిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాం ...
ప్రభుత్వ కార్యాలయాల మొండి బకాయిపై ప్రత్యేక దృష్టి : ఎస్‌ఈ
హిందూపురం టౌన్, డిసెంబరు 14 : విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటే భవిష్యత్ తరాలకు వెలుగు నివ్వవచ్చని ఏపీఎస్‌పీడీసీ ఎల్ ఎస్‌ఈ వరకుమార్ అన్నారు. పట్టణం లోని ఆర్‌కే ఫంక్షన్‌హాల్‌లో సోమవారం జిల్లా స్థాయిలో పరిశ్రమ యజమానులకు విద్యుత్ పొదుపుపై అవగాహన సదస్సు నిర్వహించా రు. విద్యుత్ పొదుపు వారోత్సవాల సందర్భం గా హాజరైన ఎస్‌ఈ మాట్లాడుతూ వినియోగ దారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యుత్ వినియో గంపై పట్టణ ప్రజలకంటే పల్లెల్లోనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ కా ర్యాలయాలు, పంచాయతీల నుంచి మొండి బకాయిలు ఉన్నాయని వాటిని చెల్లిస్తేనే విద్యుత్ ను సక్రమంగా అందజేయవచ్చన్నారు. ప్రభు త్వం పంచాయతీలకు విడుదల చేసిన నిధుల్లో 40 శాతం విద్యుత్ బిల్లులకు చెల్లించాలని ఆదే శాలున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేద న్నారు. జిల్లాలో మైనర్ పంచాయతీల నుంచి రూ.405కోట్లు, మేజర్ పంచాయతీల నుంచి రూ.105కోట్లు, హంద్రీనీవా నుంచి రూ.423కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి రూ. 123కోట్లు, సత్య సా యి వాటర్‌వర్క్స్ నుంచి 126కోట్లు, తెలు గు గంగ నుంచి రూ.147కోట్లతో పాటు మునిసిపాలిటీల నుంచి అధికశాతం బకా యిలు ఉన్నాయన్నారు. జిల్లాలో 12మిలి యన్ల యూనిట్ల వినియోగముందని ఇం దులో 4మిలియన్ యూనిట్లు పారిశ్రామిక రంగానికి వినియో గిస్తున్నారన్నారు. లైన్‌మన్లు ప్రైవేట్ వ్యక్తులతో పోల్ ఎక్కించరాదని అలా ఎవరైనా చేస్తే చర్యలు తీసుకుంటామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఏఓ బాలాజీ వెంకటేశం, ఈఈ పరం ధామయ్య, డీఈఈ భూపతి, ఏడీలు చైతన్య లక్ష్మి, జాక్సన్, కళ్యాణ్‌చక్రవర్తి, తూముకుంట పారిశ్రామికవాడ యజమానుల సంఘం అధ్య క్షుడు మూర్తి, పరిశ్రమల యజమానులు పాల్గొ న్నారు. సంబంధిత పోస్టర్లు విడుదల చేశారు.