ఇంట్లోనే ఉందాం.. కరోనాను అంతం చేద్దాం

ABN , First Publish Date - 2020-04-15T10:24:12+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి..

ఇంట్లోనే ఉందాం.. కరోనాను అంతం చేద్దాం

పుర ప్రజలకు ఎమ్మెల్యే బాలయ్య విన్నపం 


హిందూపురం టౌన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. దీనిని అంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ ముగిసేవరకు ఇళ్లలోనే ఉండాలంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపు నిచ్చారు. లాక్‌డౌన్‌ను మే3 వరకు ప్రధాని మోదీ పొడిగించిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఒక ప్రకటనను విడుదల చేశారు. లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలని ఇంటికే పరిమితం కావడం, మన మనోధైర్యం ముందు కరోనా ఓడిపోయిందని దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న తీరు మనం తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల కరోనాను చాలా వరకు నివారించగలిగామన్నారు.


అయితే ఈ మహాయజ్ఞంలో కుటుంబాలు వదిలి అహర్నిశలు మనకోసం శ్రమిస్తున్న వైద్యులు, సిబ్బంది, పోలీసులు, మునిసిపల్‌, రెవెన్యూ సిబ్బంది, పాత్రికేయుల కృషి ఆత్మబలం ముందు కరోనా నిలబడలేకపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను పొడిగించడం మంచిదేనన్నారు. మన కోసం శ్రమిస్తున్నవారి కోసం ఇళ్లలోనే ప్రార్థన చేద్దామని కరోనా లేని దేశాన్ని చూద్దామని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిరుపేద కుటుంబాలకు కార్మికులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. దాతలు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్న మహిళా మూర్తులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-04-15T10:24:12+05:30 IST