-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Lets face the YCP anarchy bravely
-
వైసీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొందాం
ABN , First Publish Date - 2020-06-22T10:26:04+05:30 IST
నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాదినేని ఉమామహేశ్వర్

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉమా
కళ్యాణదుర్గం, జూన్ 21: నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాల ముఖ్య నాయకులతో సమీక్షించారు. వైసీపీ నేతల ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొని అడ్డుకట్ట వేయాలన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇంటింటా ప్రచారం చేయాలన్నారు.
పాలనలో ఎన్‌టీఆర్ విగ్రహానికి నిప్పు, దానిమ్మ, మామిడి చెట్లు నరికివేత, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా పరిపాలన సాగించాల్సిన పాలకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతుండడంతో ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. ఏదిఏమైనా గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి కార్యకర్తల సంరక్షణ కోసం ఐక్యతగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు.