వీడని వైరస్
ABN , First Publish Date - 2020-09-03T10:42:04+05:30 IST
జిల్లాను కరోనా వైరస్ వీడట్లేదు. ఈనెల ఒకటో తేదీన 456 కేసులు నమోదవటంతో ప్రభావం తగ్గుతుందేమోనని అనుకునేలోపే.. బుధవారం మళ్లీ 810 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది...

జిల్లాలో 810 కొత్త కేసులు.. నలుగురి మృతి
అనంతపురం వైద్యం, సెప్టెంబరు 2: జిల్లాను కరోనా వైరస్ వీడట్లేదు. ఈనెల ఒకటో తేదీన 456 కేసులు నమోదవటంతో ప్రభావం తగ్గుతుందేమోనని అనుకునేలోపే.. బుధవారం మళ్లీ 810 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా మరో నలుగురు బాధితులు మరణించారు, అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 42394 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 36052 మంది కోలుకున్నారు. 6001 మంది కరోనాతో పోరాడుతున్నారు. కరోనా మరణాలు 341కి చేరాయి. బుధవారం మరో 674 మంది కోలుకోవటంతో డిశ్చార్జ్ చేసినట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.
నేడు శాంపిళ్లు సేకరించే ప్రాంతాలివే..
గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా నమూనాలు సేకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సేవాఘడ్, వన్నేదొడ్డి, ఎన్‌పికుంట, ఆమడగూరు, పరిగి, గుడిబండ, కణేకల్లు,గుమ్మఘట్ట, నాయక్‌నగర్ (అనంతపురం), బుక్కరాయసముద్రం, యల్లనూరు, పెద్దపప్పూరు, హిందూపురం, ఇంద్రానగర్ (అనంతపురం), చిలమత్తూరు, కదిరి, తనకల్లు, పుట్టపర్తి, కొత్తచెరువు, కళ్యాణదుర్గం, ధర్మవరం, దుర్గానగర్, కొత్తపేట, తాడిపత్రి, గుంతకల్లుతోపాటు జిల్లా కేంద్రంలో ఎస్‌ఎ్‌సబీఎన్, బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఆర్టీసీ బస్టాండులో నమూనాలు సేకరిస్తామన్నారు.