లేపాక్షి శిల్పకళలు అద్భుతం

ABN , First Publish Date - 2020-02-16T09:50:40+05:30 IST

లేపాక్షి దుర్గా వీరభద్రస్వామి ఆలయంలో శిల్ప, చిత్రకళలు అద్భుతంగా ఉన్నాయని గుంటూరు జిల్లా సీఐడీ అడిషనల్‌ ఎస్‌పీ సరిత అన్నారు.

లేపాక్షి శిల్పకళలు అద్భుతం

 సీఐడీ అడిషనల్‌ ఎస్పీ సరిత


లేపాక్షి, ఫిబ్రవరి 15 : లేపాక్షి దుర్గా వీరభద్రస్వామి ఆలయంలో శిల్ప, చిత్రకళలు అద్భుతంగా ఉన్నాయని గుంటూరు జిల్లా సీఐడీ అడిషనల్‌ ఎస్‌పీ సరిత అన్నారు. శనివారం ఆమె ఆలయాన్ని సందర్శించారు. ఏడు శిరస్సుల నాగేంద్రుడు, అర్ధంతరంగా ఆగిన కల్యాణమండపం, సీతాదేవిపాదం, నాట్యమండపం, వేలాడేస్తంభాన్ని సందర్శించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా శిల్పకళలు ఉన్నాయన్నారు. ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని ఆమె కొనియాడారు. అనంతరం దుర్గా వీరభద్రస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక వీఆర్‌ఓ సూర్యప్రకాశ్‌, ఆలయ గైడ్‌ రఘునాథ్‌,ఈమె వెంట ఉన్నారు.  

Updated Date - 2020-02-16T09:50:40+05:30 IST