-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Kurvada Express is a suspect of what Covid said
-
కుర్లా ఎక్స్‌ప్రెస్‌లో ‘కోవిడ్’ అనుమానితుడు
ABN , First Publish Date - 2020-03-23T09:56:21+05:30 IST
కుర్లా ఎక్స్‌ప్రె్‌స లో ఆదివారం ఓ ప్రయాణికుడు కరోనా లక్షణాలతో అస్వస్థతకు గురవడంతో సహప్రయాణికు లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలింపు
రైల్వేబోగీని సీజ్ చేసిన అధికారులు
గుంతకల్లు, మార్చి 22 : కుర్లా ఎక్స్‌ప్రె్‌స లో ఆదివారం ఓ ప్రయాణికుడు కరోనా లక్షణాలతో అస్వస్థతకు గురవడంతో సహప్రయాణికు లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముంబ యి నుంచి కోయంబత్తూరు వెళ్లే కుర్లా ఎక్స్‌ప్రె స్‌లో ఓ ప్రయాణికుడు కోయంబత్తూరుకు బ యలుదేరాడు. రైలు రాయచూరు వద్ద ఉన్న స యమంలో ఇతడు తీవ్రంగా దగ్గుతూ అస్వస్థత కు గురయ్యాడు. గమనించిన సహ ప్రయాణికు లు బీ-4 బోగీలో ఉన్న టీటీఈ కిశోర్‌కు సమాచారమిచ్చారు. టీటీఈ ప్రయాణికుడి వద్దకు వ చ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జ్వరం కూడా అధికంగా ఉండటంతో వెంటనే గుంతక ల్లు రైల్వే ఆసుపత్రి వర్గాలకు సమాచారమిచ్చా రు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రైలు గుంతకల్లు స్టేషన్‌కు రాగా రైల్వే ఆసుపత్రి వై ద్యులు ప్రయాణికున్ని పరీక్షించారు. 105 డిగ్రీల జ్వరంతో పాటు దగ్గు కూడా ఉండటంతో ఆ ప్ర యాణికున్ని వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే అధికారులు బీ-4 బోగీని సీజ్ చేశారు. కా గా ఆ ప్రయాణికున్ని ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేటెడ్ వార్డుకు తరలించి పరీక్ష లు చేయగా క రోనా లక్షణాలు నిర్ధారణ కాలేదు. దీంతో అతని స్వస్థలం థానేకు ప్రైవేట్ అంబులెన్సులో పం పించారు.