తప్పని ఆటంకాలు
ABN , First Publish Date - 2020-04-05T10:33:15+05:30 IST
కోవిడ్ - 19 విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆర్థిక సాయం పంపిణీలో పలు రకాల ఆటంకాలు ఎదురయ్యాయి.

ఆర్థిక సాయం పంపిణీలో ఇబ్బందులు
బియ్యం కార్డుదారులకు రూ. వెయ్యి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
జాబితాలు ఇవ్వకపోడంతో వలంటీర్ల అయోమయం
యాప్‌లో కొందరి అర్హుల పేర్లు కనిపించని వైనం
సవ్యంగా పనిచేయని యాప్...డబ్బులు పంపిణీపై తీవ్ర ప్రభావం
అర్హులకు అందని సాయం... ఆందోళనలో లబ్ధిదారులు
అనంతపురం వ్యవసాయం ఏప్రిల్ 4 : కోవిడ్ - 19 విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆర్థిక సాయం పంపిణీలో పలు రకాల ఆటంకాలు ఎదురయ్యాయి. బియ్యం కార్డుదా రులకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్ పంపిణీ తరహాలోనే వలంటీర్ల ద్వారా డబ్బులు పంపిణీకి శనివారం శ్రీకారం చుట్టారు. ఆర్థిక సాయం చేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. అయితే యాప్ సక్రమంగా పనిచేయక పోడంతో పలు ప్రాంతాల్లో వలంటీర్లు డబ్బులు ఇవ్వలేక పోయారు. ప్రత్యేక యాప్‌లో కొన్ని అర్హులైన బియ్యం కార్డుల పేర్లు ఎక్కలేదు. దీంతో అర్హులను గుర్తించడంలో వలంటీర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో నిజంగా అర్హులని తెలిసినా డబ్బులు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. మరికొన్ని ప్రాంతాల్లో వలంటీర్లకు ప్రత్యేక యాప్ నిర్వహణ ఎలా చేయాలో తెలియకపోవడంతో గ్రామ సచివాలయాల్లో కనుక్కొని మళ్లీ వస్తామని వెళ్లి పోవడం గమనార్హం.
జాబితాలు ఇవ్వకపోడంతో వలంటీర్ల అయోమయం
జిల్లా వ్యాప్తంగా 12.19 లక్షల రేషన్‌కార్డులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాత రేషన్‌కార్డులకు బదులుగా బియ్యం కార్డులు జారీ చేసింది. నవశకం సర్వేలో పలు రకాల కొత్త ఆంక్షలు విధించి కోత విధించారు. కొత్త నిబంధనల మే రకు జిల్లాలో 10.67 లక్షల మంది బియ్యం కార్డులకు అర్హ త సాధించారు. వీరిలో 9 లక్షల మందికి మాత్రమే బియ్యం కార్డులు జారీ చేశారు. ఆర్థిక సాయం అందించేం దుకు అర్హుల జాబితాను అధికారులు అందించకపోవ డంతో వలంటీర్లు అయోమయానికి గురయ్యారు. తమకు కేటాయించిన ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యం కార్డు నెంబర్‌ను యాప్‌లో ఎంటర్ చేసుకొని అర్హులో..? కాదో సరిచూసుకో వాల్సి వచ్చింది.
ఇదే క్రమంలో యాప్‌లో బియ్యం కార్డు ఉన్న వారి పేర్లు కూడా కనిపించలేదు. మరోవైపు ఇప్పటి దాకా బియ్యం కార్డులు అందని వారికి ఏ విధంగా డబ్బు లు ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ విషయా లపై సంబంధిత అధికారులకు, వలంటీర్లకు సరైన అవ గాహన కల్పించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధా ర్ నెంబర్‌ను యాప్‌లో ఎంటర్ చేస్తే అర్హుల జాబితా వస్తుందని అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో వేలాది మంది అర్హుల పేర్లు యాప్‌లో కనిపించకపోడంతో వలంటీర్లు ఇబ్బందిపడ్డారు.
సవ్యంగా పనిచేయని యాప్
ప్రభుత్వ ఆర్థిక సాయం అందించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు యాప్ సక్రమంగా పనిచేయలేదు. పలు రకాల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో డబ్బులు పంపిణీపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లా వ్యాప్తంగా 10.67 లక్షల మందికి రూ.1000 చొప్పున అందించాల్సి ఉండగా తొలి రోజు 6.79 లక్షల మందికి డబ్బులు పంపిణీ చేశారు. ఆది వారం సెలవు రోజైనా ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని డీఆర్డీఏ యంత్రాంగం స్పష్టం చేసింది.
యాప్‌లో నెలకొన్ని పలు రకాల సాంకేతిక సమస్యలతో అ ర్హుల పేర్లు ఎక్కించకపోవడంతో వారికి ఆర్థిక సాయం అందక ఆందోళన చెందుతున్నారు. ఇదిఇలా ఉండగా రా ప్తాడు మండలం భోగినేపల్లి గ్రామంలో 409 కార్డులుంటే 330 కార్డులకు సరిపడే డబ్బులు మాత్రమే పంపారు. దీంతో పూర్తి స్థాయిలో డబ్బులు వచ్చే వరకు డబ్బులు ఇవ్వకూడదని స్థానిక వైపీసీ నాయకులు ఆదేశించడంతో వలంటీర్లు మిన్నకుండిపోయినట్లు సమాచారం.
ఉచిత సరుకులు అందించి.. ఆర్థిక సాయం ఇవ్వని వైనం
జిల్లాలో బియ్యం కార్డుల అనర్హత జాబితాలోని లబ్ధి దారులకు రూ. వెయ్యి ఇవ్వకపోవడంతో వారికి నిరాశే మిగిలింది. కోవిడ్ - 19 విపత్కర పరిస్థితుల్లో ఉచితంగా బియ్యం, కంది బేడలు అనర్హత జాబితాలోని అందరికీ అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆర్థిక సా యం అందించకపోవడంతో బాధిత వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. అనంతపురం నగరం పరిధిలోని రహ్మత్ నగర్ 13వ క్రాస్‌లో అర్హులైన రాములమ్మ, ఆదెమ్మ, శ్రావణి, కళావతి, ముంతాజ్ బేగం తదితరులకు నెల వారిగా విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుందన్న కారణంతో రేషన్‌కార్డును అనర్హత జాబితాలో ఉంచారు. అయితే తమకు నిర్దేశించి యూనిట్ల కంటే తక్కువగా వస్తుందని సచివాలయాల్లో అర్జీలు ఇచ్చారు. అయితే వారి దరఖా స్తులు పరిష్కరించలేదు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఇదే సమస్యను ఎదుర్కొన్నారు.