కొరియన్లపై డేగకన్ను

ABN , First Publish Date - 2020-03-18T10:22:38+05:30 IST

కరోనా కలకలం నేపథ్యంలో పెనుకొండలోని కియ, అనుబంధ సంస్థలపై వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక నిఘాఉంచింది.

కొరియన్లపై డేగకన్ను

ఫిబ్రవరి 10 తరువాత వచ్చిన వారిపై నిఘా

వారి నివాసాలు, రెస్టారెంట్లపై ఆరా

8 మంది ఆరోగ్యంపై పర్యవేక్షణ 


హిందూపురం, మార్చి 17: కరోనా కలకలం నేపథ్యంలో పెనుకొండలోని కియ, అనుబంధ సంస్థలపై వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక నిఘాఉంచింది. ఇందులో భా గంగా పెనుకొండలోని కియతో పాటు సోమందేపల్లి, పాలసమంద్రం ప్రాంతాల్లో గల అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న, కొరియా నుంచి ఇటీవల వచ్చిన విదేశీయుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా దక్షిణకొరియా నుంచి కియ ప్రతినిధులు, ఉద్యోగులు కియ, అనుబంధ సంస్థలకు రాకపోకలు సాగి స్తూంటారు. ఈ క్రమంలో ఉద్యోగులు ఎవరైనా జనవరి, ఫిబ్రవరి నెలల్లో దక్షిణకొరియాతో పాటు విదేశాల నుంచి వచ్చారా అనే సమాచారాన్ని వైద్యఆర్యోగ శాఖ సేకరిస్తోంది. అయితే పిబ్రవరి 10 తరువాత దక్షిణ కొరియా నుంచి 47 మంది కియకు వచ్చారు. ప్రధానంగా దక్షిణ కొరియా దేశస్థులు పెనుకొండ, పాలసముద్రం, బెంగళూరు, అనంతపురం, పుట్టపర్తి, హిందూపురం ప్రాంతాల్లో అత్యఽధికంగా నివాసం ఉంటున్నారు.


అలాగే కియ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కొంతమంది బెంగళూరులో ఉంటూ ప్రతిరోజూ కియకు రాకపోకలు సాగిస్తూంటారు. అలాగే పెనుకొండ  సమీపంలోని విల్లాస్‌, టౌన్‌షి్‌ఫ, కొరియన్‌ రెస్టారెంట్లలో చాలామంది పనిచేస్తున్నారు. ఇటీవల కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న  నేపధ్యంలో వీరి రాకపోకలతోపాటు నివాస ప్రాంతాలపై జిల్లా వైద్యఆరోగ్యశాఖ యంత్రాంగం దృష్టి సారించింది.. కియ, అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న విదేశీయుల నివాసాల్లో వారి ఆర్యోగ పరిస్థితి విచారించి నివేదిక ఇవ్వాలని కోరింది. అయితే కియ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న విదేశీ ప్రతినిధులు, ఉద్యోగులపై పరిశ్రమ యాజన్యమే వైద్య పరీక్షలు నిర్వహిస్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు నివేదిక ఇస్తోంది. ఇటీవల దక్షిణ కొరియా నుంచి వచ్చిన 47మంది ఆరోగ్య పరిస్థిఽతిపై  ప్రతిరోజూ ఆరా తీస్తున్నారు. వీరిలో 8 మందిపై ప్రత్యేక పర్యవేక్షణ పెటా ్టరు. అయితే ఇటీవల దక్షిణ కొరియా నుంచి వచ్చిన వారందరూ ఆరోగ్యంగా ఉన్న ట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.


జిల్లాకు బెంగళూరు, దేవనహళ్లి ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులోనే కరోనా వైరస్‌ గుర్తించేందుకు స్కానింగ్‌ పరీక్షలు చేస్తున్నారు. అలాగే విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి గురించి జిల్లా వైద్యఆరోగ్యశాఖకు సమాచారం ఇస్తున్నారు. అయినా ప్రత్యేకంగా దక్షిణ కొరియా నుంచి జిల్లాకు వచ్చిన వారి వివరాలతోపాటు వారిఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పెనుకొండతోపాటు చుట్టుపక్కలున్న అనుబంధ సంస్థలు, నివాస ప్రాంతాల్లో ఎవరెవరు విదేశీయులున్నారు, ఇటీవల ఎవరైనా వచ్చారా అని ఆరా తీస్తూ వారి ఆరోగ్యపరిస్థితులపై వైద్య బృందాలు ఆరా తీస్తున్నాయి. 


Updated Date - 2020-03-18T10:22:38+05:30 IST