స్వార్థ ప్రయోజనాల కోసమే రాజధాని వికేంద్రీకరణ

ABN , First Publish Date - 2020-09-13T06:37:14+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్వార్థ రాజకీయాల కోసమే రాజధాని వికేంద్రీకరణకు సిద్ధమయ్యాడని ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలకపూడి

స్వార్థ ప్రయోజనాల కోసమే రాజధాని వికేంద్రీకరణ

కళ్యాణదుర్గం/కుందుర్పి, సెప్టెంబరు 12: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్వార్థ రాజకీయాల కోసమే రాజధాని వికేంద్రీకరణకు సిద్ధమయ్యాడని ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలకపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. శనివారం కళ్యాణదుర్గం, కుందుర్పి మండలాల్లో కన్వీనర్‌ చౌళం మల్లికార్జున, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రాజధాని విషయంలో జగన్‌ మాటతప్పాడని మండిపడ్డారు. విశాఖ ప్రాంతంలో జగన్‌ బినామిల పేరుతో ముందస్తుగా సుమారు 500 ఎకరాలకు పైబడి భూములు కొనుగోలు చేసి ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవ చేశారు. సమావేశంలో నాయకులు పాపంపల్లి రామాంజినేయులు, గోపాల్‌,  ఆర్‌జీ శివశంకర్‌, శ్రీనివాసరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, డీకే రామాంజినేయులు, ఒంటిమిద్ది సత్తి, ధనుంజయ, గురు, సన్నమల్ల, గురుప్రసాద్‌, మల్లికార్జున, కొల్లాపురప్ప, శ్రీరాము లు, గురు, గోపాల్‌, మహదేవ్‌, రాంభూపాల్‌, తిమ్మప్ప, రోషన్‌, రాయపాటి సాయికృష్ణ, షేక్‌సాహెబ్‌, అబిజిత్‌, రాఘవేంద్రబాబు, చిత్రలింగ, నాగేంద్ర, రామ్మూర్తినాయుడు, గంగాధర, నాగేంద్ర, సత్తి పాల్గొన్నారు.

Updated Date - 2020-09-13T06:37:14+05:30 IST