-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Kia who has become extinct
-
నిర్మానుష్యంగా మారిన కియ
ABN , First Publish Date - 2020-03-23T10:01:05+05:30 IST
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కియ పరిశ్రమ నిర్మానుష్యంగా మారింది. ఆదివారం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నివారణ చర్యలపై కేంద్రం జనతా కర్ఫ్యూ పిలుపుమేరకు కియ యాజమాన్యం ఉత్పత్తులు నిలిపివేసింది.

పెనుకొండ రూరల్, మార్చి 22: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కియ పరిశ్రమ నిర్మానుష్యంగా మారింది. ఆదివారం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నివారణ చర్యలపై కేంద్రం జనతా కర్ఫ్యూ పిలుపుమేరకు కియ యాజమాన్యం ఉత్పత్తులు నిలిపివేసింది. అందులో భాగంగా పెనుకొండ సమీపంలోని కియ కార్లపరిశ్రమ యాజమాన్యం సెలవు ప్రకటించడంలో కియా ఉత్పత్తులు, రవాణా సౌకర్యం పూర్తీగా నిలిపివేశారు. పరిశ్రమ సమీపంలోని రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సోమవారం యథావిధిగా పరిశ్రమల ఉత్పత్తులు సౌకర్యం కొనసాగుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.