-
-
Home » Andhra Pradesh » Ananthapuram » kerala ig in atp
-
సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేద్దాం
ABN , First Publish Date - 2020-12-28T05:58:17+05:30 IST
బం జారాలు ఎక్కడున్నా ఏకతాటిపైకి రావాలనీ, బంజారాల సమస్యల పరిష్కారానికి సమష్టి గా కృషి చేద్దామని కేరళ ఐజీ గుగులోత్ లక్ష్మ ణ్ నాయక్ పిలుపునిచ్చారు.

కేరళ ఐజీ గుగులోత్ లక్ష్మణ్ నాయక్
అనంతపురం టౌన్, డిసెంబరు 27: బం జారాలు ఎక్కడున్నా ఏకతాటిపైకి రావాలనీ, బంజారాల సమస్యల పరిష్కారానికి సమష్టి గా కృషి చేద్దామని కేరళ ఐజీ గుగులోత్ లక్ష్మ ణ్ నాయక్ పిలుపునిచ్చారు. అఖిల భారత బంజారాల సేవాసంఘం ఆధ్వర్యంలో ఆదివా రం సాయంత్రం జిల్లాకేంద్రంలోని రెండో రోడ్డు లో ఉన్న బంజారాభవన్ వద్ద ‘బంజారాల ఆ త్మీయ సమ్మేళనం’ కార్యక్రమం నిర్వహించారు. ఆయనతోపాటు విజయవాడ ఎకై్ౖసజ్ శాఖ జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బం జారాల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి అఖిల భా రత బంజారాల సేవాసంఘం కృషి చేస్తోందన్నారు. సంఘం బలోపేతం కోసం వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా తండాల్లో పర్యటించామన్నారు. తండాల్లో మౌలిక సదుపాయాల కల్పన,తో పాటు బంజారాలకు సంక్షే మ పథకాలను అందించేందుకు సంఘం కృషి చేస్తోందన్నారు. సంఘాన్ని అన్ని జిల్లాల్లోనూ బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఫైర్ సర్వీసెస్ రాష్ట్ర డైరెక్టర్ కరంతోట్ జయరాంనాయక్, కృష్ణాయూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్‌నాయక్, విశ్రాంత ఏజీఎం బాలానాయక్, అఖిల భారత బంజారా సేవాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మానాయక్, నాయకులు అశ్వర్థనాయక్, రంగ్లానాయక్, సంత్‌శ్రీ సేవాలాల్ కోశాధికారి రవీంద్రనాయక్, అమరావతి ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ హరేరామనాయక్, సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్రటరీ లక్ష్మీబాయి, ఎస్కేయూ రెక్టార్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు.