శైవ క్షేత్రాల్లో కార్తీక పూజలు

ABN , First Publish Date - 2020-12-15T05:57:23+05:30 IST

కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు వైభవంగా కొనసాగాయి.

శైవ క్షేత్రాల్లో కార్తీక పూజలు



గుంతకల్లు టౌన, డిసెంబరు 14: కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు వైభవంగా కొనసాగాయి. పట్టణంలోని రాతిగుడి రామలింగేశ్వరస్వామి, భవాని చంద్రశేఖరస్వామి, సిద్దేశ్వరస్వామి, మార్కండేయ స్వామి, గుంతా రామలింగేశ్వరస్వామి, పాతగుంతకల్లు శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేకువజాము నుంచి మ హిళలు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు.  మధ్యా హ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని దోనిముక్కల విరుపాక్షేశ్వర స్వామి, బుగ్గసంగాల బుగ్గసంగమేశ్వర స్వామి, కసాపురం కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయాల్లో భక్తజన సందడి నెలకుంది. 

విడపనకల్లు: మండలంలోని ఉండబండ వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక మాస అమావాస్య పూజలను భక్తులు సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం స్వామివారిని ప్రత్యేక పూలతో అలంకరించి ఆకుపూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు స్వామి వారి సన్నిధిలో కార్తీక దీపా లు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భద్రకాళి దేవిని ప్రత్యేక పూలతో అలంకరించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.


బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో..

తాడిపత్రి టౌన : పట్టణంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ, అభిషేకాలు కొనసాగాయి. రాజరాజేశ్వరి అ మ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.


వీరభద్రస్వామి ఆలయంలో..

బొమ్మనహాళ్‌: స్థానిక వీరభద్రస్వామి ఆలయంలో సోమవారం కార్తీక అమావాస్య పూజలు నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ, పం చామృతాభిషేకం, రుద్రాభిషేకం అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. సో మవారం అమావాస్య కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 


ఉమామహేశ్వరుడికి అన్నాభిషేకం

తాడిపత్రి రూరల్‌: మండలంలోని చిన్నపొలమడ గ్రామంలో వెలసిన గణపతి సహిత ఉమామహేశ్వర స్వామికి సోమవారం క్షీరాభిషేకం, అన్నాభిషేకం, శివ అష్టోత్తర, బిల్వార్చన పూజలు చేశా. కార్తీకమాసం చివరి సోమవారంతోపాటు అమావాస్య కావడంతో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు.


తిమ్మమ్మ మాతకు ప్రత్యేక పూజలు

యల్లనూరు: మండలంలోని తిమ్మంపల్లిలో వెలసిన తిమ్మమ్మ మాతకు కార్తీకమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. 


ఐదుకల్లులో ఆవుల జాతర 

 శెట్టూరు: మండలంలోని ఐదుకల్లు గ్రామంలో సోమవారం ఆవుల జాతరను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఉత్సవ విగ్రహాలను పూ లమాలలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన గూడు చుట్టూ ఆవులు, మేకలు, గొర్రెలతో ప్రదక్షిణలు చేయించారు. జాతరలో జనసందడి నెలకుంది.

బెళుగుప్ప: మండలంలో వెలసిన శివాలయాల్లో సోమవారం కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. శివుడికి అభిషేకాలు చేసి, కార్తీక దీపాలు వెలిగించారు. ఎర్రగుడి శివాలయంలో రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. 

కళ్యాణదుర్గం టౌన : పట్టణంలో వెలసిన శివాలయాల్లో కార్తీక మాస చివరి సోమవారం పూజలు వైభవంగా కొనసాగాయి. కోట భవానిశంకర్‌ ఆలయంలో  రుద్రాభిషేకం అనంతరం స్వామివారికి ఉయాలోత్సవాన్ని నిర్వహించారు. సా యంత్రం ఆలయ ఆవరణలో మహిళలు పెద్దఎత్తున కార్తీక దీపాలు వెలిగించా రు. నీలకంఠేశ్వరస్వామి, లక్ష్మీనరసింహస్వామి, ఈరన్నస్వామి ఆలయాల్లో స్వా మివారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు చేశారు. 


వీరభద్రుడిగా భోగేశ్వరుడు

పామిడి: పట్టణంలోని భోగేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివారు వీరభద్రుడిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి వేకువజామునే పంచామృతాభిషేకాలు, అర్చనలు, ప్ర త్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారు, ప్రసన్న పార్వతీదేవి అ మ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులు దర్శించుకున్నారు. సొరకాయలపేట గ్రామంలో అభయాంజనేయస్వామి, పులికనుమ పెద్దమ్మ ఆలయాల్లో విశేషపూజలు నిర్వహించారు. 

 

వైభవంగా ముత్యాల పల్లకీ రథోత్సవం

విడపనకల్లు: స్థానికంగా వెలసిన సుంకులమ్మదేవి ముత్యాల పల్లకీ రథోత్సవాన్ని సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో ముస్తాబుచేశారు. సుంకులమ్మ దేవి, దేవమ్మ దేవిని ప్రత్యేక పూలతో అలంకరించారు. అమావాస్య కావడంతో వివిధ గ్రామాల భక్తులు పూజలు నిర్వహించి మొ క్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాగణంలో భక్తులకు అన్నదానం చేశారు. రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం వద్ద నుంచి ముత్యాలపల్లకీ వరకు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకు వచ్చి పల్లకీలో కొలువుదీర్చారు. అనంతరం  స్థానిక బస్టాండ్‌ వరకు కలశాలతోసాగిన ఊరేగింపులో మేళతాళాలు, కోలాటాలు ఆకర్షణగా నిలిచాయి.


చేళ్లగురికి ఎర్రితాత ఆలయంలో..

విడపకనల్లు మండల సరిహద్దులోని చేళ్లగురికి గ్రామంలో ఎర్రితాత ముత్యాల పల్లకీ రథోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుం చి భక్తులు  తరలివచ్చి స్వామివారి సమాధికి విశేష పూజలు చేశారు. 

రాయదుర్గం రూరల్‌ : మండలంలోని చదం గ్రామ సమీపంలో లింగాలబండపై వెలసిన పశుపతినాఽథుని ఆలయంలో సోమవారం అమావాస్య పూజలు చేశారు. ఉదయాన్నే స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ఆకుపూజ, బిల్వార్చన పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్ర జలు తరలివచ్చి దర్శించుకున్నారు. 


జోడులింగాల ఆలయంలో..

కూడేరు: కార్తీకమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని స్థానిక జోడులింగాల సంగమేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి  అభిషేకాలు, విశేష పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీఎత్తున తరలివచ్చారు. ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి, మొక్కులు తీర్చుకున్నారు.  

Updated Date - 2020-12-15T05:57:23+05:30 IST