జగన్‌కు పిచ్చి ముదిరింది
ABN , First Publish Date - 2020-03-16T10:30:12+05:30 IST
జగన్‌కు పిచ్చి ముదిరింది
రాయదుర్గంటౌన్, మార్చి 15 : ముఖ్యమంత్రి జగన్‌కు పిచ్చి ముదిరిందని చెప్పడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల కమి షనర్‌పై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించా రు. వ్యవస్థలంటే ముఖ్యమంత్రికి చులకన భావన అ ని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌కు కులాన్ని ఆపాదించ డం దుర్మార్గమని పేర్కొన్నారు. పంచాయతీలకు నిధులు రావాలని గగ్గోలు పెడుతున్న అధికార పార్టీ ముందుగా పంచాయతీ ఎన్ని కలకు నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిపాదన మేరకే ఎన్నికల క మిషన్ షెడ్యూల్ ప్రకటించిందన్నారు. జగన్ ఏమి చెబితే ఎన్నికల కమిషన్ అది వినాలా అని ప్రశ్నించారు. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ మీద ముఖ్య మంత్రి హోదాలో ఉండే వ్యక్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడ టం అత్యంత బాధ్యతారాహిత్యమన్నారు.